Nayanthara : పంతాన్ని పక్కన పెట్టేసిన నయన్.. చిరు సినిమాకు నయనతార రెమ్యునరేషన్ ఎంతంటే..
ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికీ చిరు సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేస్తుంటాయి. ఆరుపదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ భారీ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. చిరు కెరీర్ లో 157వ సినిమాగా రూపొందించిన ఈ సినిమాపై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఎప్పుడూ లేనిది నయన్ సైతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొనడం మరింత గమానార్హం. ఈ సినిమాతో మరోసారి చిరు జోడిగా నటించనుంది నయన్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ మూవీతో వెండితెరపై సందడి చేయనున్నారు.
అయితే ఇప్పుడు చిరు, అనిల్ రావిపూడి కాంబో గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం నడిచింది. చివరకు ఈ ప్రాజెక్ట్ కోసం రూ.18 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ పారితోషికం అత్యధికం. దీంతో ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది నయన్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..




