- Telugu News Photo Gallery Cinema photos Sree Vishnu will be do a film with the director of that hit movie.
Sree Vishnu: మరోసారి పొట్ట చెక్కలే.. ఆ హిట్ దర్శకుడితో శ్రీవిష్ణు సినిమా..
ఈ మధ్య టాప్ ఫామ్‌లో ఉన్నారు శ్రీ విష్ణు. తనదైన డైలాగులు.. అదిరిపోయే కామెడీతో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్‌గా మారిపోయారు. సింగిల్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈయన.. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌కే ఓకే చెప్పారు. మరోసారి పొట్ట చెక్కలే అంటున్నారు. మరి ఎవరా దర్శకుడు..? అసలు శ్రీ విష్ణు ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు..?
Updated on: May 18, 2025 | 4:00 PM

ఒకప్పుడు శ్రీ విష్ణు అంటే సీరియస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ కొన్నాళ్లుగా ఈయన స్టైల్ మార్చారు. పూర్తిగా యూత్‌కు నచ్చే కంటెంట్ వైపు అడుగులేస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి.

అలాగని ఫ్యామిలీస్‌కు దూరంగా ఉంటున్నారా అంటే అదేం లేదు. సామజవరగమనా లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు.. ఓం భీమ్ బుష్‌తో యూత్‌కు సమన్యాయం చేసారీయన. తాజాగా సింగిల్‌తో మరో హిట్ కొట్టారు.

సామజవరగమనా, ఓం భీమ్ బుష్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన స్వాగ్ అంతగా ఆడలేదు. ఈ సినిమాకు ఓటిటిలో టాక్ బానే వచ్చినా థియేటర్లలో మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు అనే చెప్పాలి.

ఈ మధ్యే హ్యాష్ ట్యాగ్ సింగిల్‌తో మరోసారి తనలోని కామెడీతో గెలుపు తలుపు తీసారు శ్రీ విష్ణు. గీతా ఆర్ట్స్‌లోనే మరో సినిమాకు కూడా ఈ హీరో రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది. ఈసారి ఆయ్ దర్శకుడితో జోడీ కట్టబోతున్నారు.

గీతా ఆర్ట్స్‌లోనే సింగిల్ సినిమా చేసిన శ్రీ విష్ణు.. అదే సంస్థలో పరిచయమైన ఆయ్ దర్శకుడు అంజితో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మృత్యుంజయ్, విష్ణు విస్మయంతో పాటు మరో సినిమా చేస్తున్నారు. వీటి తర్వాత ఆయ్ దర్శకుడు అంజితో శ్రీ విష్ణు సినిమా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్ సినిమానే.




