AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hit 3 OTT: ఓటీటీలో నాని బ్లడ్ బాత్ .. హిట్3 మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం హిట్-3: ది థర్డ్ కేస్. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో సినిమా ఇది. శ్రీనిధి హీరోయిన్ గా నటించింది. మే 01న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Hit 3 OTT: ఓటీటీలో నాని బ్లడ్ బాత్ .. హిట్3 మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Hit 3 Movie
Basha Shek
|

Updated on: May 19, 2025 | 6:17 PM

Share

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హిట్-3: ది థర్డ్‌ కేస్‌. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని, నానిలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండడం, ప్రమోషన్లు గట్టిగా నిర్వహించడంతో హిట్-3 అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.. అందుకు తగ్గట్టుగానే మేడే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నాని గత సినిమాలతో పోల్చితే ఇందులో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చాయి. అయినా ఆడియెన్స్ కు హిట్-3 సినిమా బాగా ఎక్కేసింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు వంద కోట్లు దాటేశాయి. అలాగే రిలీజై మూడు వారాలు గడిచినా చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అదే సమయంలో హిట్-3 సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హిట్-3 మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందని ప్రచారం జరుగుతోంది. హిట్-3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇందుకోసం రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం. థియేటర్‌లో రిలీజైన ఐదు వారాల తర్వాత హిట్-3 సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం.

ఈ లెక్కన మే చివరి వారం లేదంటే జూన్ 5న హిట్ -3 సినిమా ఓటీటీలోకి రావొచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది. నాని సినిమాతో పాటు మరో హీరో సూర్య నటించిన ‘రెట్రో’ కూడా కాస్త దాదాపు ఇదే తేదీకే ఓటీటీ స్ట్రీమింగ్ కు రావొచ్చని తెలుస్తోంది. హిట్- 3 సినిమాలో సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్ర ఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అడివిశేష్ తదితర స్టార్ హీరోలు క్యామియో రోల్స్ లో కనిపించారు. ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ స్వరాలు సమకూర్చాడు.

ఇవి కూడా చదవండి

హిట్- 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..