AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Single OTT: ఓటీటీలోకి శ్రీ విష్ణు సూపర్ హిట్ సినిమా! సింగిల్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా సింగిల్. తమిళ డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూల్లు రాబట్టింది.

Single OTT: ఓటీటీలోకి శ్రీ విష్ణు సూపర్ హిట్ సినిమా! సింగిల్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Single Movie
Basha Shek
|

Updated on: May 20, 2025 | 12:55 PM

Share

గతేడాది స్వాగ్ తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు మరోసారి కామెడీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. అతను నటించిన తాజా చిత్రం సింగిల్. కేతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. రిలీజ్ కు ముందే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు. దీంతో రిలీజ్ కు ముందే సింగిల్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే మే 09న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు, కేతిక, ఇవానా మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. మొత్తానికి సింగిల్ తో మరో సూపర్ హిట్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పటికే ఈ సినిమా రూ. 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సింగిల్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అంటే జూన్ 6వ తేదీన లేదా జూన్ 12న సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందన్నమాట.

ఇవి కూడా చదవండి

గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సింగిల్ సినిమాను నిర్మించారు. వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్ శ్రీను, సత్య, రెబా మోనికా జాన్, మానస చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూర్చారు.

అమెజాన్ ప్రైమ్ చేతిలో సింగిల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?