Manchu Manoj: ‘బాబాయ్.. ఏది ఏమైనా నీకు నేనుంటా’.. మంచు మనోజ్‌కు సపోర్టుగా టాలీవుడ్ హీరో
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ మూవీ ఈనెల 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఏలూరులో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.

మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించక సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. దీంతో అతని రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల కంటే తన పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు మనోజ్. ఇటీవల అతని కుటుంబంలో చాలా సంఘటనలు జరిగాయి. తండ్రి మోహన్ బాబు, విష్ణుతో తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం ఇలా ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య సినిమాను పూర్తి చేశాడు మనోజ్. దీంతో ఆదివారం జరిగిన భైరవం ఈవెంట్ లో మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘సొంతం వాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకొని నాకు ఇంత ప్రేమాభిమానాలను పంచుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎన్నో కష్టాలు చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మంచు వారబ్బాయి. దీంతో అక్కడున్నవారందరూ కొంచెం ఎమోషనల్ అయ్యారు. తోటి హీరోలు మనోజ్ ను సముదాయించారు. ఇదే క్రమంలో మనోజ్ ను ఉద్దేశిస్తూ హీరో నారా రోహిత్ ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఏది ఏమైనా మనోజ్ కు తాను అండగా ఉంటానని అందులో చెప్పారు. ‘భైరవం’ ఈవెంట్‌ను సక్సెస్ చేసిన ఏలూరు ప్రాంత వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఈవెంట్ తో నిన్న అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించాం. మా ఈవెంట్‌ను ఎంతో ప్రత్యేకంగా మార్చిన ఏలూరు ప్రజలకు రుణ పడి ఉంటాను. ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ బాబాయ్ హైలైట్‌గా నిలిచాడు. ఆయన స్పీచ్ ఎంతో పవర్‌ఫుల్, భావోద్వేగంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. విషయం ఏదైనా.. నేను నీకు తోడుగా ఉంటాను బాబాయ్. లవ్ యూ’ అని రోహిత్ పేర్కొన్నాడు.
నారా రోహిత్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. అంతకు ముందు భైరవం ఈవెంట్ లోనూ మంచు మనోజ్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు నారా రోహిత్. ‘బాబాయ్ (మనోజ్)తో నాది చాలా స్పెషల్ జర్నీ. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికీ పరిచయం ఉంది. మేము చాలా క్లోజ్. ఈ సినిమాతో మా అనుబంధం మరింత పెరిగింది. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమా భైరవం ‘ అని నారా రోహిత్ చెప్పుకొచ్చాడు.
నారా రోహిత్ ట్వీట్..
Had a wonderful evening yesterday in Eluru for #Bhairavam. Heartfelt thanks to the amazing people of Eluru for making it special. The highlight of the event was Babai @HeroManoj1, his speech was powerful, emotional, and truly heartwarming. Babai, no matter what, I’ll always be…
— Rohith Nara (@IamRohithNara) May 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








