- Telugu News Photo Gallery Cinema photos Tollywood young talented directors who came from Nani's compound
Young Directors: నాని కాంపౌండ్ నుంచి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్.. వారెవరు.?
ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ చాలు కెరీర్ మారిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో అలా ఒక్క హిట్‌తోనే వెండితెర మీద క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. ఇలా సత్తా చాటుతున్న కుర్ర దర్శకులు ఎక్కువగా నాని కాంపౌండ్ నుంచే రావటం మరో ఇంట్రస్టింగ్ పాయింట్.
Updated on: May 19, 2025 | 3:50 PM

నాని హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న శౌర్యువ్, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.

కోర్ట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రామ్ జగదీష్ కూడా నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరోసారి నాని బ్యానర్‌లోనే దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే దుల్కర్‌కు కథ కూడా వినిపించారు రామ్ జగదీష్.

శౌర్యువ్, రామ్ జగదీష్ కన్నా ముందే నాని కాంపౌడ్‌లో సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెలా టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ చిరంజీవి సినిమాకు దర్శకుడిగా ఓకే అయిన శ్రీకాంత్, ప్రజెంట్ నానితోనే ప్యారడైజ్‌ను తెరకెక్కిస్తున్నారు.

అలాగే నాని అవకాశం ఇచ్చిన మరో దర్శకుడు వివేక్ ఆత్రేయ. అయన దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరికి డిజాస్టర్ అయింది. అయినప్పటికీ వివేక్ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేసారు. ఇది బ్లాక్ బస్టర్ అయింది.

వీరికి ముందు కూడా నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను లాంటి చాలామంది యంగ్ హీరోలను పరిచయం చేసారు నాచురల్ స్టార్. ఇలా నాని సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన దర్శకులు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ప్రూవ్ చేసుకుంటున్నారు.



















