AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బావిలో బంగారం ఇచ్చే పిశాచి.. మనుషుల్ని ఎరగా వేసే ఫ్యామిలీ.. ఓటీటీలో ‘తుంబాడ్’ లాంటి హారర్ థ్రిల్లర్

హారర్ థ్రిల్లర్ సినిమాలకు సంబంధించి తుంబాడ్ ఒక మాస్టర్ పీస్. ఓ నిధి అన్వేషణ చుట్టూ తిరిగే ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. అయితే సేమ్ టు సేమ్ ఇలాంటి కథతోనే ఓటీటీలో మరో హారర్ థ్రిల్లర్ మూవీ ఉంది.

OTT Movie: బావిలో బంగారం ఇచ్చే పిశాచి.. మనుషుల్ని ఎరగా వేసే ఫ్యామిలీ.. ఓటీటీలో 'తుంబాడ్' లాంటి హారర్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: May 19, 2025 | 3:17 PM

Share

మహారాష్ట్రలోని తుంబాడ్‌ అనే గ్రామంలో దాగి ఉన్న నిధి చుట్టూ సాగిన కథ తుంబాడ్‌. ఇందులో అత్యాశ మనిషిని ఎంతటికైనా దిగజారుస్తుందనే విషయాన్ని ఎంతో ఆసక్తిగా చూపించారు. ఇప్పుడు ఇలాంటి హారర్ థ్రిల్లర్ మూవీనే మరొకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులోనూ ఓ మోస్తరుగా ఆడింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ఇచ్చింది. మనిషికి రుచి మరిగిన రాక్షసి బావిలో ఉండి లెక్కలేనంత బంగారం ఇచ్చే కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో గజ, కాళీ, శంకర్ అనే ముగ్గురు వ్యక్తులు కామిని అనే డాక్టర్‌ని కిడ్నాప్ చేస్తారు. ఆమెను వీళ్ల బాస్ నైనా దగ్గరికి తీసుకువెళ్తారు. అయితే ఇదివరకే కామినిని కిడ్నాప్ చేయడానికి నైనా మరొక వ్యక్తిని పంపించి ఉంటాడు. కానీ ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు. అతనేమయ్యాడో తెలుసుకోవడానికి డాక్టర్ ను కిడ్నాప్ చేస్తారు. కానీ ఆమె తనకేం తెలియదని చెప్తుంది. అయితే అతను నిధి కోసం తమిళనాడు వెళ్లి ఉంటాడని తెలుసుకుంటారు. ఈ క్రమంలోన అందరూ కలిసి తమిళనాడులోని ఓ గ్రామానికి వెళతారు. అక్కడ కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి అడుగుతారు. అయితే చీకటవ్వడంతో ఆ గ్రామంలో ఉన్న వారంతా దయ్యాలుగా మారిపోతారు. ఊరంతా ఎటు తిరిగినా దయ్యాలే కనిపిస్తుండడంతో ఎటు పోవాలో తెలియక భయపడిపోతారు. అయితే మత్తమ్మ అనే దయ్యం వేసే ప్రశ్నకి సమాధానం చెప్తే ప్రాణాలతో బయటపడొచ్చని తెలుసుకుంటారు. దారిలో వీరికి ఆ దయ్యం ఎదురవుతుంది. ఆమె వీళ్లకు ఒక కథ చెప్తుంది.

ఈ గ్రామంలో ఒకప్పుడు మత్తమ్మ బాయి తవ్విస్తూ ఉండగా ప్రమాదవశాత్తూ ఒక మనిషి అందులో పడిపోతాడు. దానికి బదులుగా బావి నుంచి బంగారం బయటికి వస్తుంది. ఇది తెలుసుకున్న మత్తమ్మఅత్యాశతో తన భర్తని కూడా ఆ బావిలో పడేస్తుంది. దానికి బదులుగా మళ్లీ బంగారం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఊరిలో వారందరిని చంపి బంగారం తీసుకుందామని ప్లాన్ వేస్తుంది. ఇందుకోసం ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. మరి మత్తమ్మ వేసిన ప్లాన్ ఏమిటి? ఆ ఊరిలో చనిపోయిన వారందరూ దయ్యాలుగా ఎందుకు మారిపోయారు? చివరికి మత్తమ్మ వీళ్లను కూడా చంపుతుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ హారర్ థ్రిల్లర మూవీ పేరు కట్టేరి. అంటే రక్త పిశాచి అనే అర్థం. సినిమా మధ్యలో కొంచెం బోర్ కొట్టినా స్టార్టింగ్ సీన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. అలాగే చివరి అర్ధగంట అయితే ఊపిరి బిగపట్టి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..