AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

ఇప్పుడు ఓటీటీల్లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు అడియన్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమై కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో.. సరికొత్త చిత్రాలను రూపొందించేందుకు మేకర్స ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లలో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని ఏలేస్తుంది.

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..
Sikandar
Rajitha Chanti
|

Updated on: May 29, 2025 | 8:20 AM

Share

భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాప్ అయిన సినిమాల గురించి వినే ఉంటారు. ఈ ఏడాది ఓ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ అందుకుంది. కానీ ఇప్పుడు ఆ మూవీ ఓటీటీని ఊపేస్తుంది. బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయినా ఇప్పుడు ఓటీటీ సినీప్రియులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆ సినిమా దేశంలోనే టాప్ ట్రెండింగ్. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే సికందర్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామగా రూపొందించిన ఈ సినిమా ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ పాత్రలో కనిపించింది. అలాగే శర్మన్ జోషి, సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ వంటి తారలు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.

ఈ సినిమా కథ మొత్తం సంజయ్ రాజ్‌కోట్ అంటే సల్మాన్ ఖాన్ చుట్టూ తిరుగుతుంది. ఆయన ఒక శక్తివంతమైన వ్యక్తి. ప్రజలు ఆయనను చాలా ప్రేమిస్తారు. సంజయ్ అందరికీ సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న సంజయ్ భార్య సాయిశ్రీ పాత్రలో కనిపిస్తుంది. ఆమె తన భర్తను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఇందులో సత్యరాజ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు.

ఇక థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా మే 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ దేశంలోని టాప్ 10 జాబితాలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద రూ.103 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.176 కోట్లు రాబట్టింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మించారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్