10 June 2025

ఆ హీరోయిన్ వయసు 19.. హీరో ఏజ్ 31.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం ఈ వయ్యారి సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. 41 ఏళ్ల వయసులోనూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. 

రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తోన్న ఈ వయ్యారి.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? 

41 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లనే టెన్షన్ పెడుతుంది. ఇప్పుడు సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్‏గా మారింది ఈ హీరోయిన్. 

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ త్రిష. 20 సంవత్సరాలుగా తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు టాప్ హీరోయిన్ ఆమె. 

వర్షం సినిమాతో తెలుగులో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో పారితోషికం విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. 

తాజా సమాచారం ప్రకారం త్రిష ఒక్కో సినిమాకు ఏకంగా రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇటీవలే థగ్ లైఫ్ సినిమాలో నటించింది త్రిష. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి దాదాపు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్ నడుస్తుంది.

తమిళంలో విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్ట్స్ చేస్తుందని సమాచారం.