Tollywood: 20 ఏళ్లుగా ఒక్క హిట్టు రాలేదు.. 3 బ్లాక్ బస్టర్స్ రిజెక్ట్ చేసిన హీరోయిన్.. అయినా క్రేజ్ మాములుగా లేదు భయ్యో..
దాదాపు రెండు దశాబ్దాలుగా ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. అంతేకాదు 20 ఏళ్ల సినీప్రయాణంలో మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రిజెక్ట్ చేసి ఇప్పటికీ ఎంతో బాధపడుతుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

బాలీవుడ్ సినీరంగంలో ఆమె క్రేజీ హీరోయిన్. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో కొనసాగుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. అలాగే తన వరకు వచ్చిన మూడు భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రిజెక్ట్ చేసింది. దీంతో ఇప్పటికీ తెగ ఫీల్ అవుతుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇటీవల హిందీలో సూపర్ హిట్ అయిన హౌస్ ఫుల్ 5 సినిమాతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసిన హీరోయిన్ చిత్రాంగద సింగ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్ లో కోల్పోయిన కొన్ని సినిమాల గురించి ఇప్పటికీ బాధపడుతున్నట్లు తెలిపింది. అలాగే కొన్ని పొరపాట్లతో అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది. ఇంతకీ చిత్రంగద మిస్సైన సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
చిత్రాంగద మాట్లాడుతూ.. “తొమ్మిదేళ్లు సినిమా ఆఫర్స్ లేకుండా గడిపాను. ఎన్నో తప్పులు చేశాను. అనురాగ్ బసు గ్యాంగ్ స్టర్ సినిమాకు నేను నో చెప్పాను. అలాగే తను వెడ్స్ మను సినిమాకు నేను నిరాకరించాను. మంగళ్ పాండే సినిమాలో అమీషా పటేల్ పోషించిన పాత్రకు నేను నో చెప్పాను… కానీ ఈ సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే షారుఖ్ ఖాన్ నటించిన చల్తే చల్తే (2003) సినిమాలో నేను నటించాల్సింది. కానీ అనుకోకుండా ఆ సినిమాను మిస్ కావాల్సి వచ్చింది. ఆ సినిమాలో నన్ను ఎంపిక చేసి.. నన్ను సంప్రదించేందుకు జూహి చావ్లా సోదరుడు బాబీ నా నంబర్ కోసం చాలా ప్రయత్నాలు చేశారట” అంటూ చెప్పుకొచ్చింది.
షారుఖ్ తో ఒక యాడ్ ఫిల్మ్ లో పనిచేసినప్పుడు చల్తే చల్తే సినిమా గురించి తనకు చెప్పారని గుర్తు చేసుకుంది చిత్రాంగద. ఈ రెండు దశాబ్దాల కెరీర్ లో హజారోన్ ఖ్వైషేన్ ఐసీ వంటి సినిమాల్లో నటించింది. అలాగే ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు హౌస్ ఫుల్ 5 సినిమాతో మెప్పించింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..








