OTT Movie : ఫైట్స్ లేవు.. విలన్స్ లేరు.. గ్లామర్ సాంగ్స్ అసలే లేవు.. అయినా ఓటీటీని ఊపేస్తోన్న సినిమా..
ఇటీవల కాలంలో ఓటీటీలో క్రేజీ కంటెంట్ ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో అడియన్స్ సైతం ఇప్పుడు కొత్త కొత్త జానర్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సంచనలం సృష్టిస్తుంది. ఫైట్స్ లేవు.. విలన్స్ లేరు.. స్పెషల్ సాంగ్స్ అసలే లేవు.. అయినప్పటికీ ఓటీటీని ఊపేస్తోన్న సినిమా ఏంటో తెలుసా.. ?

ఇటీవల కాలంలో ఓటీటీలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అడియన్స్ ఇష్టప్రకారమే ఈ జానర్ చిత్రాలను ఎక్కువగా విడుదల చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు.. ఎలాంటి అంచనాలు, భారీ బడ్జెట్ లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అలాగే పలు వెబ్ సిరీస్ లు ఓటీటీని శాసిస్తున్నారు. ఇటీవల హిందీలో విడుదలైన పంచాయత్, గుల్లక్ వంటి కామెడీ సినిమాలు చూసి మీరు విసిగిపోయి ఉంటే ఇప్పుడు మీరు ఫైట్స్, యాక్షన్, విలన్స్, స్పెషల్ సాంగ్స్ లేని ఓ చిన్న వెబ్ సిరీస్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న ఈ ప్రత్యేకమైన సిరీస్ గురించి తెలుసుకుందామా. గతేడాది ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది.
మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ఈ సిరీస్ మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈతరం యువత తల్లిదండ్రులుగా మారడం వల్ల వాళ్లు ఎదుర్కోనే సమస్యలు.. వాటిని వారు ఎలా అధిగమించాలనే సమస్యలను చూపిస్తుంది. దీనికి ట్రిప్లింగ్ ఫేమ్ సుమిత్ వ్యాస్ దర్శకత్వం వహించారు. ఇందులో స్నేహం, తల్లిదండ్రులు, ఉమ్మడి కుటుంబం, న్యూక్లియర్ కుటుంబాలకు సంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలను అందంగా చిత్రీకరించారు. అదే రాత్ జవాన్ హై. ముగ్గురు స్నేహితుల కథ. కుటుంబం, తల్లిదండ్రుల పెంపకం వంటి సమస్యలను ఈ ఇందులో ఎంతో బాగా చూపించారు. IMDb 8.2 రేటింగ్ పొందిన ‘రాత్ జవాన్ హై’లో అసుర్ ఫేమ్ బరుణ్ సోబ్తి ప్రధాన పాత్రలో నటించారు.ఈ సిరీస్ గతేడాది సోనీలివ్ ఓటీటీలో విడుదలైంది.
యూత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులుగా మారడం.. 30 ఏళ్ల తర్వాత వారి ఆలోచనలు ఎలా ఉంటాయి..? పరిధి లేని కోరికల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనే అంశాలను ఈ సిరీస్ లో చూపించారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆక్టట్టుకుంటుంది. ఈ సినిమాలో ఫైట్స్, విలన్స్, గ్లామర్ సాంగ్స్ అసలే లేవు.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..