AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న ఫంక్షన్‌ హాల్స్

దేశంలో వంట గ్యాస్ కొరత హోటళ్లు, రెస్టారెంట్లనే కాకుండా, పెళ్లిళ్లు, శుభకార్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో పెళ్లి విందుల ఖర్చులు అమాంతం పెరిగాయి. గతంలో పోల్చితే ప్రస్తుతం ప్లేట్ భోజనం ధరలు రెట్టింపునకు చేరాయి. ఈ నేపథ్యంలో కట్టెలు, బొగ్గులతో వంట చేయిద్దాం అనుకుంటే అందుకు పంక్షన్ హాల్ నిర్వాహకులు సైతం నో చెబుతున్నారు.

పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న ఫంక్షన్‌ హాల్స్
Wedding Catering Costs (1)
Anand T
|

Updated on: Mar 14, 2026 | 5:47 PM

Share

వంట గ్యాస్ కొరత దేశాన్నే వెంటాడుతోంది. కమర్షియల్‌ సిలిండర్ల సప్లై తగ్గిపోవడంతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతబడ్డాయి. ఇప్పుడీ కొరత వివాహాలు, శుభకార్యాలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వివాహాలకు విందు భోజనాలు వడ్డించడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. వివాహానికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం భోజనాలు చేసి వెళ్లడం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే. అయితే ఇప్పుడీ గ్యాస్ ట్రబుల్‌తో పెళ్లిళ్ల ఎలా జరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వివాహమైనా, శుభకార్యమైనా వేలాది మందికి పైగా అతిథులు వస్తారు. గతంలో అయితే ప్లేట్‌కు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకూ వెజిటేరియన్ భోజనం ఉండేది. కానీ నేడు దానిని మరింతగా పెంచేశారు. ఒక్కొక్క ప్లేట్ ధర పదిహేను వందల రూపాయలకు పెంచినట్లు తెలుస్తోంది. మరొకవైపు గ్యాస్ కొరత వల్ల కట్టెలు, బొగ్గులతో వంటలు చేయించి వడ్డించేందుకు కొన్ని హోటల్స్ సిద్ధమవుతున్నాయి. దీంతో ప్లేట్ రేట్‌ అమాంతం పెరిగింది. అటు ఫంక్షన్ హాల్స్‌ కూడా వంటల విషయం తమకు సంబంధంలేదని, పాత్రలు, నీటి సరఫరా మాత్రమే చేస్తామని షరతులు పెడుతున్నారు.

సరే వంట మనుషులను పెట్టుకుని ఎలాగోలా ఇబ్బంది పడి కట్టెల పొయ్యి మీద వంట చేయిద్దామంటే దానికి వాళ్లూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. పొగ వల్ల ఇబ్బందవుతోందని.. గ్యాస్ మీద గంటలో అయ్యే పని కట్టెల పొయ్యి మీద మూడు-నాలుగు గంటలు పడుతుందంటున్నారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు ఆ తిప్పలు మాకొద్దు బాబోయ్ అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..