AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఓటీటీకి నేను రెడీ.. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విశ్వంభర చిత్రంతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తాజాగా కుబేర సక్సెస్ మీట్ లో పాల్గొన్న చిరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంకో 40 ఏళ్లు ఇండస్ట్రీని కుమ్మేద్ధాం నాగ్ అని అన్నారు.

Megastar Chiranjeevi: ఓటీటీకి నేను రెడీ.. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..
Dhanush, Chiranjeevi, Nagar
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2025 | 11:02 AM

Share

ఇన్నాళ్లు హీరోగా వెండితెరపై అలరించిన నాగార్జున.. ఇప్పుడు విభిన్న పాత్రలలో మెప్పిస్తున్నారు. ఊపిరి సినిమా తర్వాత మరోసారి ముఖ్యమైన పాత్రతో మెప్పించారు. నాగార్జున, హీరో ధనుష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేర. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ..ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్రయూనిట్ ను అభినందించారు. అలాగే తాను ఓటీటీకే ఒకే అని.. ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“నేను ఇక్కడికి అతిథిగా రాలేదు.. ఆత్మీయుడిలా వచ్చాను.. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జునను కలిసినప్పుడు కుబేర సినిమా గురించి అడిగాను. ఇది చాలా డిఫరెంట్ మూవీ నేను కూడా ఇప్పటివరకు చేయని విధంగా క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పాడు. అలాగే ఇందులో ధనుష్ లీడ్ రోల్ అని నాగ్ చెప్పినప్పుడు నువ్వేలా చేశావ్ అని అడిగాను.. అప్పుడు ఒకటే మాట చెప్పాడు. ఎప్పుడూ హీరోగా చేసి చేసి విసుగొచ్చింది.. అందుకే కొత్తగా ట్రై చేస్తున్నాను.. ఇది వర్కవుట్ అయితే నాకు చాలా రోల్స్ రావడానికి గేట్స్ ఓపెన్ అయినట్లే అని నాగ్ అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా నాగ్.. నీకు ఇలాంటి ఎన్నో మంచి రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇందాక నువ్వు మాట్లాడుకో ఇంకో 40 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని చెప్పావ్ కదా.. నాకు నిజమే అనిపిస్తుంది. అయితే నీతో పాటు సమానంగా నేను కూడా వచ్చేసాతను.. హీరో పాత్రలే కాదు.. రేపు అవసరం అయితే ఓటీటీలో ఏమైనా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ.. ఇలా చెప్పాను కదా అని పొద్దున్నే క్యారెక్టర్స్ పట్టుకుని వచ్చేయకండి ” అని చిరంజీవి అన్నారు.

అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ.. 25 ఏళ్లల్లో 10 సినిమాలు మాత్రమే శేఖర్ చేశాడు. కానీ అవన్నీ ఆణిముత్యాల్లాంటి సినిమాలు. 1998లో స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఫస్ట్ టైమ్ చూశానని శేఖర్ చెప్పాడు. అప్పుడు నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని బలంగా అనుకున్నాడట. నన్ను స్పూర్తిగా తీసుకుని శేఖర్ ఈ స్థాయికి రావడం నాకు గర్వంగా ఉంది అని అన్నారు చిరు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..