Thanuja Gowda: అతడి భార్య ఉసురు నీకు తగులుతుంది.. నెటిజన్ కామెంట్‌కు తనూజ స్ట్రాంగ్ రిప్లై..
బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి నుంచి సోషల్ మీడియాలో మారుమోగిన పేరు తనూజ పుట్టస్వామి. ఈ సీజన్ విన్నర్ తనే అంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. అదే స్థాయిలో ఆమెకు ఫాలోయింగ్ సైతం ఉండేది. కానీ ఊహించని విధంగా చివరి నిమిషంలో ఆమె రన్నర్ గా నిలిచింది. తాజాగా తనూజ గురించి ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

బిగ్‌బాస్ సీజన్ 9.. మొత్తం వినిపించిన పేరు తనూజ పుట్టస్వామి. తెలుగులో మొదటి సారి లేడీ విన్నర్ అవుతుందని అనుకున్నారు. అదే స్థాయిలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సైతం ఉండేది. కానీ చివరకు ఆమె రన్నరప్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ ముగిసి చాలా రోజులు అయినప్పటికీ నెట్టింట తనూజ పేరు వినిపిస్తూనే ఉంది. ఆమె ఫ్యా్న్స్ ఇంకా సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ పెడుతూనే ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత తనూజ ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. అలాగే అభిమానులను సైతం కలవలేదు. తాజాగా ఫస్ట్ టైమ్ ఫ్యాన్స్ తో మాట్లాడేందుకు ఇన్ స్టాలో ముచ్చట్లు పెట్టింది. ఈ సందర్భంగా చాలా మంది నెటిజన్స్ తనూజ గురించి పర్సనల్ విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తనూజపై పలువురు నెటిజన్స్ విమర్శలు గుప్పించారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
బిగ్ బాస్ జర్నీలో పవన్ సాయి హార్డ్ వర్క్ చూసినప్పుడు మీకు ఏం అనిపించింది అని ఓ నెటిజన్ అడగ్గా..ఈ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంతగా నిలదొక్కుకోవడానికి తన వెనుక ఉన్న బలమైన శక్తి పవన్ సాయి అని అన్నారు తనూజ. ఎప్పుడు తనకు అండగా ఉంటాడని.. అది తన అదృష్టం అని అన్నారు. తన వల్ల పనన్ నెగిటివ్ అయినందుకు చాలా బాధపడ్డానని.. అయినా సరే నవ్వుతూ ఏదీ శాశ్వాతం కాదని మన పని మీద మనమే దృష్టి పెట్టాలని చెప్తాడని.. డిప్రెషన్ లో ఉన్నప్పుడు తనకు కావాల్సిన బలాన్న మాటలతో అందిస్తాడని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
ఈ క్రమంలో ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. పవన్ సాయి భార్య కర్మ నిన్ను విదిలిపెట్టదు.. ఆమె ఉసురు వెంటాడుతుంది అంటూ కామెంట్ చేయగా.. తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యింది. నీ కర్మ నిన్ను వెంటాడకముందే నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో.. నా గురించి బాధపడకు..నేను చాలా బాగున్నా.. అంత బాగానే ఉంది.. నా కర్మ బాగుంది. నీ ఫేస్ చూపించకుండా ఇలాంటి మెసేజ్ పెట్టడానికి సిగ్గుగా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనూజ ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ నెట్టింట వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
