AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Schedule : ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. బీసీసీఐ కొత్త ప్లాన్ ఇదే

IPL 2026 Schedule : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా టీ20 వరల్డ్ కప్ 2026 ఫీవర్‌లో మునిగిపోయింది. టీమిండియా సెమీఫైనల్ చేరుతుందా లేదా అనే ఉత్కంఠలో ఫ్యాన్స్ ఉండటంతో ఐపీఎల్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. అయితే తెరవెనుక ఐపీఎల్ పండుగకు రంగం సిద్ధమవుతోంది.

IPL 2026 Schedule : ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. బీసీసీఐ కొత్త ప్లాన్ ఇదే
దీనితో పాటు, 2027 నుంచి, IPL లీగ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. అంటే ప్రతి జట్టు ఇక్కడ 18 మ్యాచ్‌లు ఆడుతుంది. 9 మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్‌లో జరుగుతాయి. మిగిలిన 9 మ్యాచ్‌లు అవే గ్రౌండ్‌లో జరుగుతాయి. ఈ విధంగా, ప్రతి జట్టు లీగ్ దశలో 18 మ్యాచ్‌లు ఆడుతుంది. మొత్తం మీద, ప్రేక్షకులు ఐపీఎల్ సీజన్-19లో 84 మ్యాచ్‌లను చూసే అవకాశం పొందుతారు. అలాగే, వచ్చే ఏడాది నుంచి అంటే 2027 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 94 మ్యాచ్‌లు జరగడం దాదాపు ఖాయం.
Rakesh
|

Updated on: Feb 28, 2026 | 8:50 AM

Share

IPL 2026 Schedule : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా టీ20 వరల్డ్ కప్ 2026 ఫీవర్‌లో మునిగిపోయింది. టీమిండియా సెమీఫైనల్ చేరుతుందా లేదా అనే ఉత్కంఠలో ఫ్యాన్స్ ఉండటంతో ఐపీఎల్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. అయితే తెరవెనుక ఐపీఎల్ పండుగకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట అనుకున్న తేదీ కంటే టోర్నీ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందని సమాచారం.

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. వాస్తవానికి, బీసీసీఐ గతంలోనే అన్ని ఫ్రాంచైజీలకు పంపిన సమాచారం ప్రకారం మార్చి 26 నుంచే టోర్నీ మొదలవ్వాల్సింది. అంటే రెండు రోజులు ఆలస్యంగా ఈ క్రికెట్ జాతర షురూ కాబోతోంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను మే 31న నిర్వహించాలని బోర్డు ప్లాన్ చేస్తోంది. ఈ మార్పుల వెనుక ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే కారణమని తెలుస్తోంది.

వచ్చే ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‎కి చెన్నై, కోల్‌కతా నైట్ రైడర్స్‎కి కోల్‌కతా హోమ్ గ్రౌండ్‌లు కాగా.. రాజస్థాన్ రాయల్స్ తన రెండో హోమ్ గ్రౌండ్‌గా గువాహటి (అస్సాం)ని వాడుతోంది. ఈ నగరాల్లో భద్రత, ఎన్నికల కోడ్ వంటి అంశాల వల్ల షెడ్యూల్ ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది. అందుకే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే వారం సమావేశమై, ఎన్నికల తేదీలను బట్టి షెడ్యూల్‌ను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉంది.

గతంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీసీసీఐ ఇదే పద్ధతిని అనుసరించింది. ప్రస్తుతానికి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, వచ్చే వారం నాటికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ హడావుడి మొదలవ్వడం ఖాయం. ధోనీ ఆడతాడా లేదా? మెగా వేలంలో ఎవరెవరు ఏ జట్లకు వెళ్తారు? అనే ఉత్కంఠలో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ షెడ్యూల్ వార్త ఒక మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్.. దరఖాస్తు ఇలా..
IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్.. దరఖాస్తు ఇలా..
కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. ఉప్పల్‌లో రికార్డుల వేట..!
కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. ఉప్పల్‌లో రికార్డుల వేట..!
ఆ హీరో కారణంగానే టాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు..
ఆ హీరో కారణంగానే టాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు..
మగవాళ్లు కూడా సున్నితమైన వారే.. వారిని ఏడిపించే 12 విషయాలివే
మగవాళ్లు కూడా సున్నితమైన వారే.. వారిని ఏడిపించే 12 విషయాలివే
అత్యంత తెలివైన వారు కూడా ప్రేమలో పడితే మూర్ఖులుగా మారుతారా?
అత్యంత తెలివైన వారు కూడా ప్రేమలో పడితే మూర్ఖులుగా మారుతారా?
పీఎఫ్ ఖాతా నుండి నెలలో ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?
పీఎఫ్ ఖాతా నుండి నెలలో ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?
కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే క్రీమీ కోల్డ్ కాఫీని ఇలా చేయండి
కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే క్రీమీ కోల్డ్ కాఫీని ఇలా చేయండి
ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది?
ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది?
విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే - అన్నాడీఎంకే చర్చలు..!
విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే - అన్నాడీఎంకే చర్చలు..!
అమెజాన్‌లో మరో గ్రేట్ సమ్మర్ సేల్..ఊహించని విధంగా డిస్కౌంట్లు..!
అమెజాన్‌లో మరో గ్రేట్ సమ్మర్ సేల్..ఊహించని విధంగా డిస్కౌంట్లు..!