AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడు.. ఓటీటీలో బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ రియల్ స్టోరీ

సోషల్ మీడియాలో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టలున్నాయి. వీటితో అప్రమత్తంగా ఉండకపోతే లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఈ సినిమా కథా నేపథ్యమిదే. సోషల్ మీడియా అందరినీ నమ్మితే లైఫ్ ఎలాంటి రిస్క్ లో పడుతుందన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు మేకర్స్.

OTT Movie: అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడు.. ఓటీటీలో బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ రియల్ స్టోరీ
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 24, 2025 | 8:18 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ జాబితాలో ఓ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ మూవీ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. అయితే ఈ మధ్యన థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడిదే ఆశతో ఈ మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు గతంలో డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. . ఓ అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఈ కాలం యువత సోషల్ మీడియా పేరుతో ఎలా పక్కదారి పడుతోందో, అమ్మాయిలు ఎలా బలవుతున్నారో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా కిట్టు అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతడు ఓ రోజు ఫ్రెండ్స్ తో కలిసి ఓ టూర్ కు వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబై అతనికి కనిపిస్తుంది. అంతే అప్పటి నుంచే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాట పడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ ఆమె నో చెబుతుంది. దీంతో కిట్టు ఉన్మాదిలా మారిపోతాడు. ఆమెను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. మరి చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ మూవీ పేరు శారీ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్య యధు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలు పోషించారు. ఓ సామాజిక సందేశంతో తెరకెక్కిన సినిమానే అయినా ఇందులో మితిమీరిన హింస, బోల్డ్‌ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను దూరం చేశాయి. థియేటర్లలో ఆదరణకు నోచుకోని ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. జూన్ 27 నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో నిరాశపర్చిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?