OTT Movie: ఇదేం సినిమా రా బాబూ.. మర్డర్ మిస్టరీతో బ్లైండ్ స్పాట్.. దృశ్యం ట్విస్టులను మించిపోయింది..
ఈమధ్య కాలంలో మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ జానర్ సినిమాలు చూసేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీలో ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 1 గంట 29 నిమిషాల సస్పెన్స్, థ్రిల్ నిండిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది.

ఈ సంవత్సరంలో విడుదలైన ఒక సినిమా ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. మూవీ ప్రారంభమైన 40 నిమిషాల తర్వాత సినిమా కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ప్రతిక్షణం ఉత్కంఠతో సాగుతుంది. సినిమా క్లైమాక్స్ మీ మనసును కదిలిస్తుంది. మనం మాట్లాడుతున్న సినిమా పేరు ‘బ్లైండ్ స్పాట్’. ఇది క్రైమ్ మిస్టరీ చిత్రం. ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ఇందులో రాశి సింగ్, అలీ రాజా, రవివర్మ, గాయత్రి భార్గవ, హర్ష్ రోషన్ కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమా కథ ఒక వివాహిత హత్య చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు భార్యభర్తల మధ్య ఒక రాత్రి గొడవ జరుగుతుంది. కాసేపటికి భర్త పని కోసం వేరే నగరానికి వెళ్లడానికి విమానాశ్రయానికి చేరుకుంటాడు. ఇంతలో భార్య మృతదేహం ఇంట్లో ఊరితాడుకు వేలాడుతూ కనిపించడంతో పనిమనిషి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. అప్పుడు పోలీసు అధికారి విక్రమ్ (నవీన్ చంద్ర) వెంటనే తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి ఇది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానిస్తాడు. కథ మొదలైన 40 నిమిషాల్లోనే విక్రమ్ హంతకుడిని కనుగొంటాడు. సినిమా ముగిసినట్లు అనిపిస్తుంది, కానీ అసలు కథ ఆ తర్వాతే ప్రారంభమవుతుంది.
దాదాపు 1 గంట 29 నిమిషాల నిడివి గల ‘ చిత్రంలో ప్రారంభం నుండే ఉత్కంఠతో సాగుతుంది. మొదటి నుంచి హంతకుడిని మాత్రం కనుగొనలేరు. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహించని షాక్ ఇస్తుంది. ఈ చిత్రం అతి త్వరలో టాప్ 10 జాబితాలో చేరనుంది. ప్రస్తుతం ‘బ్లైండ్ స్పాట్’ దేశంలో 5వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ రాకేష్ వర్మ రచన, దర్శకత్వం వహించారు. తెలుగులో హిందీ భాషలో నిర్మించిన ఈ చిత్రాన్నిఅమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..








