AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: హనీమూన్‌ మర్డర్.. ఓటీటీలో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు

మేఘాలయలో ఇటీవల జరిగిన హనీమూన్ మర్డర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకున్న జంట హనీమూన్‌కు వెళ్లినప్పుడు, భార్య తన ప్రేమికుడితో కలిసి తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటి నేపథ్యంతోనే ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: హనీమూన్‌ మర్డర్.. ఓటీటీలో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 28, 2025 | 9:28 AM

Share

ఈ మధ్యన ఓటీటీల్లో సినిమాల కంటే వెబ్ సిరీస్ లే ఎక్కువగా వస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ.. ఇలా ప్రముఖ భాషల్లోనూ వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఓటీటీ ఆడియెన్స్ కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఇది ఒక నూతన వధూవరుడి హత్య చుట్టూ తిరుగుతుంది. అది కూడా హనీమూన్ లో ఈ మర్డర్ జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. నూతన దంపతులు మాల్దీవులకు హనీమూన్ కు వెళతారు. అయితే ఒక మహిళా ఫోటోగ్రాఫర్ కూడా వారి ఫోటోలు తీయడానికి వస్తుంది. ఆ రోజు రాత్రే అక్కడి బీచ్ లో శవమై కనిపిస్తాడు భర్త. మరి ఆ హత్య ఎవరు చేశారన్న మిస్టరీని ఛేదించే కథతో ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇదంతా చూస్తుంటే ఇటీవల జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డరే గుర్తకు వస్తుంది కదా. అయితే ఈ వెబ్ సిరీస్ 2024లోనే వచ్చింది. దీని పేరు ‘హనీమూన్ ఫోటోగ్రాఫర్.’ అర్జున్ శ్రీవాస్తవ ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ఆశా నేగి, రాజీవ్ సిద్ధార్థ, అపేక్ష పోర్వాల్, సాహిల్ సలాథియా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

హనీమూన్ ఫోటోగ్రాఫర్ గతేడాది సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 30-35 నిమిషాల నిడివి ఉంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. వీకండ్ లో మంచి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సిరీస్ చూడాలనుకునేవారికి ‘హనీమూన్ ఫోటోగ్రాఫర్’ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

 జియో సినిమాలో హనీమూన్ ఫొటో గ్రాఫర్ వెబ్ సిరీస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..