AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సమాజంలోని నియమాలు.. అపార్థాల మధ్య రాక్షసిగా మారిన అమ్మాయి కథ.. ఓటీటీలో హారర్ మూవీ సెన్సేషన్..

హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ సినిమాలు చూడాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అందుకే ఈమధ్యకాలంలో నిత్యం ఏదోక కొత్త సినిమా, వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కథ విషయానికి వస్తే.. సమాజంలోని నియమాలు.. అపార్థాల మధ్య రాక్షసిగా మారిన అమ్మాయి కథ..ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

OTT Movie: సమాజంలోని నియమాలు.. అపార్థాల మధ్య రాక్షసిగా మారిన అమ్మాయి కథ.. ఓటీటీలో హారర్ మూవీ సెన్సేషన్..
Bulbbul Movie
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2025 | 10:59 AM

Share

సాధారణంగా సినీప్రియులు ఎక్కువగా కామెడీ జానర్ చిత్రాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఈమధ్య కాలంలో మాత్రం హారర్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ జానర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ముందుంటున్నారు. అందుకే ఇప్పుడు మీకోసం ఒక భయంకరమైన హారర్ మూవీని తీసుకువచ్చాము. సమాజంలోని నియమాలు.. అపార్థాల మధ్య రాక్షసిగా మారిన అమ్మాయి కథే ఇది. ఈ చిత్రం మిమ్మల్ని భయపెట్టడమే కాదు.. లోతైన సందేశాన్ని సైతం అందిస్తుంది. ట్విస్టులు, రహస్యాలతో నిండి ఉండడమే కాకుండా సమాజంలో దాగి ఉన్న చేదు నిజాలను సైతం చూపిస్తుంది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. ? అదే బుల్బుల్. హిందీలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇది.

బుల్బుల్.. 2020లో ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన మూవీ. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటించింది. మొదట్లో పెద్దగా స్పందన రాకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథాంశం, త్రిప్తి యాక్టింగ్ జనాలను ఆకట్టుకున్నాయి. పెద్ద వయసు ఉన్న వ్యక్తి ఒక చిన్న అమ్మాయిని ఇచ్చి బాల్య వివాహం జరిపించడం.. ఆ తర్వాత ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది సినిమా.

కథ విషయానికి వస్తే.. ఒక చిన్న అమ్మాయిని ఇంటి యజమాని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అతడితోపాటు తన తమ్ముడు సత్య కూడా అదే ఇంట్లో ఉంటారు. అయితే తన భార్య.. తమ్ముడు సత్య ఒకే వయసువారు కావడంతో స్నేహితులుగా మారతారు. దీంతో ఆ ఇంటి యజమాని తన వారిద్దరి బంధంపై అనుమానం పెంచుకుంటాడు. తన తమ్ముడిని చదువు కోసం విదేశాలకు పంపి.. ఆ తర్వాత తన భార్యను వేధిస్తుంటాడు. అప్పుడే బుల్బుల్ ఒక వైద్యుడిని కలుస్తుంది. వారిద్దరూ స్నేహితులు అవుతారు. కానీ అసలు ట్విస్టు ఇప్పుడు మొదలవుతుంది. 5 సంవత్సరాలకు సత్య విదేశాల నుంచి తిరిగి వస్తాడు. అప్పుడే గ్రామంలో మనుషులను చంపుతున్న ఒక అదృశ్యమైన మంత్రగత్తె గురించి వింటాడు. ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నిడివి దాదాపు 1 గంట 34 నిమిషాలు, IMDbలో 6.6 రేటింగ్‌ను పొందింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..