AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమారా అయ్యా.! ఐఎండీబీ 8.4 రేటింగ్.. సీన్ సీన్‌కు నరాలు కట్ అవ్వాల్సిందే

ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు వేసవి సెలవులు… వీకెండ్ రావడంతో మరిన్ని చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. పెద్ద స్టార్ హీరో సినిమాలు కాకుండా కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలకు సైతం పట్టం కడుతున్నారు.

ఏం సినిమారా అయ్యా.! ఐఎండీబీ 8.4 రేటింగ్.. సీన్ సీన్‌కు నరాలు కట్ అవ్వాల్సిందే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2025 | 6:21 PM

Share

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో ధనుష్ కుబేర సినిమా, మంచు విష్ణు కన్నప్ప సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. కాగా ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ మూవీస్ కు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది.

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఐఎండీబీ రేటింగ్ లో ఈ సినిమా ఏకంగా 8.4 రేటింగ్ సొంతంచేసుకుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. భార్య హత్యకేసులో చిక్కుకున్న భర్త ఎలా తప్పించుకున్నాడు. అసలు అతను ఎలా ఆ హత్య కేసులో చిక్కుకున్నాడు. అసలు ఆ హత్య చేసింది ఎవరు.? అనేది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

ఈ సినిమా పేరు ఒక పథకం ప్రకారం.. టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించాడు. సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ తదితరులు ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. జూన్ 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ