హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అర్రే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా.. ఆమె మరోసినిమాలో కనిపించడం లేదు. కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గుర్తుపట్టలేనంతంగా మారిపోతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు క్యూట్‌గా.. ఇన్‌స్టాలో కొత్త ట్రెండ్ తెగ చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ తాము అభిమానించే హీరోయిన్ల ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. అప్పుడలా.. ఇప్పుడలా.. ఉన్నారంటూ నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇక ఆ ఫోటోలకు విపరీతమైన లైకులు, కామెంట్స్ వచ్చిపడుతున్నాయ్. అలాగే టాలీవుడ్ నటీమణుల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. బర్త్ డే వచ్చినా.. లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసినా.. తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మీకోసం ఓ నటి ఓల్డ్ పిక్ తీసుకొచ్చేశాం.
ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?
పైన పేర్కొన్న ఫోటోలోని చిన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? తను ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఎవరీమె అని అనుకుంటున్నారా.? నిజంగా గుర్తుపట్టడం కొంచెం కష్టమే.! కానీ క్షుణ్ణంగా పరిశీలించండి.. ఈమె ఓ దర్శకుడి కుమార్తె. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అంతలా మారిపోయింది మరీ.. టీనేజ్ లో బొద్దుగా మారిన ఆమె.. జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. తన ఫిజిక్‌ను సైజ్ జీరో చేసుకుని.. సన్నజాజి తీగలా మారిపోయింది. ఈ అమ్మడు తెలుగులో సినిమాలుతగ్గించడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంతే కాదు మనకు వచ్చే లవర్ కూడా ఇలానే ఉండాలి అని కుర్రాళ్ళు అంతా అనుకునేలా తన అందంతో కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. కళ్యాణి ప్రియదర్శన్.
ఇది కూడా చదవండి : అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..
ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. తెలుగులో కళ్యాణి సినిమా చేసి దాదాపు 6 ఏళ్లు అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో 8 ఏళ్లుగా యాక్టివ్ గా ఉంది కళ్యాణి ప్రియదర్శన్. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి :ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








