AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. తల్లికి చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి.. జీవితంలో నరకం చూసిన అందాల భామ

ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే.. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. జనాలు సెలబ్రెటీల లైఫ్ లో జరిగే ప్రతి దాని పై ఓ కన్నేసి ఉంటారు. వారిజీవితంలో ఏం జరిగినా అది పెద్ద చర్చే.. ఇక సినిమా ఇండస్త్రీలో రిలేషన్స్ షిఫ్స్ గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం.

ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. తల్లికి చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి.. జీవితంలో నరకం చూసిన అందాల భామ
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2025 | 7:35 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది రెండు ముందు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు. మరికొంతమంది ఏకంగా లవ్ ఎఫైర్స్ తో నిత్యం వార్తల్లో నలుగుతుంటారు.. సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగిన చాలా మంది రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. జీవితంలో ఎంతో నరకం చూసిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా జీవితంలో ఎంతో బాధపడింది. తల్లి మాట వినకుండా పెళ్లి చేసుకొని జీవితంలో నరకం చూసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె అందంలో అప్సరస.. ఐకానిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తన అందంతో , అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరంటే..

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి జీనత్ అమన్. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి మిస్ ఇండియా విజేతగా నిలిచింది. హిందీ సినిమా రంగంలో 1970, 1980 దశకాలలో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 1951 నవంబర్ 19న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి హుస్సేన్ అమన్, సినిమా రచయిత, అలాగే తల్లి స్కిందా హీన్జ్. జీనత్ అమన్ 1970లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని, మిస్ ఆసియా పసిఫిక్ 1970 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి ప్రవేశించింది.

ఇది కూడా చదవండి : అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

జీనత్ అమన్ రెండు వివాహాలు చేసుకుంది. మొదట సంజయ్ ఖాన్‌తో (1980-1981), ఆ తర్వాత మజర్ ఖాన్‌తో (1985-1998) వివాహంజరిగింది . అయితే జీనత్  పేమించిన అబ్బాయిలను ఆమె తల్లి ఎప్పుడూ నమ్మలేదు. జీనత్ ప్రేమలను ఎప్పుడూ వెతిరేకిస్తూనే ఉండేది. దాంతో వారిద్దరి మధ్య చాలా వాగ్వాదాలు జరిగేవి. జీనత్ తన తల్లి మాట వినకుండా ఓ నటుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. యాక్టర్ మజార్ ఖాన్‌ సింగపూర్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది జీనత్.. అంతకు ముందే ఆమె మరొకరితో రిలేషన్ షిప్ లో ఉంది.. అయితే అతను ఆమె పై దారుణంగా దాడి చేశాడు. అప్పట్లో అది పెద్ద వార్త అయ్యింది. ఆతర్వాత మజర్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత కూడా జీనత్ మొదటి వ్యక్తితో రిలేషన్ కంటిన్యూ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే మజర్ ఖాన్‌ కూడా మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని జీనత్ తెలుసుకుంది. అది ఆమెను చాలా బాధపెట్టింది. మానసికంగా ఎంతో కుమిలిపోయింది, కుంగిపోయింది అయినా కూడా అతన్ని వదల్లేదు. మజర్ ఖాన్‌ ఆరోగ్యం క్షీణించిన సమయంలో అతనికి సేవలు చేసింది. 1998లో మజార్ చనిపోయాక మజార్ ఫ్యామిలీ ఆమెను అంత్యక్రియలకు కూడా రానివ్వలేదు.  మజార్ పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆతర్వాత ఆమె ఒప్పుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..

Zeenat Aman

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి