AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponnambalam: అప్పుడు చిరంజీవి 60 లక్షలు సాయం చేసి కాపాడిన ప్రాణం.. మళ్లీ ఆస్పత్రి పాలైన పొన్నాంబళం.. ఏమైందంటే?

గతంలో పొన్నాంబళం రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఆయన చికిత్సకు సహాయం చేశారు. తనకు తెలిసిన వైద్యులతో మాట్లాడి పొన్నాంబళంకు చికిత్స అందించడంతో పాటు రూ. 50 లక్షలకు పైగా ఆర్థిక సాయం చేశారు.

Ponnambalam: అప్పుడు చిరంజీవి 60 లక్షలు సాయం చేసి కాపాడిన ప్రాణం.. మళ్లీ ఆస్పత్రి పాలైన పొన్నాంబళం.. ఏమైందంటే?
Actor Ponnambalam
Basha Shek
|

Updated on: Jun 26, 2025 | 6:49 PM

Share

ప్రముఖ నటుడు పొన్నాంబళం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతంలో పలు సార్లు ఆస్పత్రి పాలై కోలుకున్న ఆయన మరోసారి హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం పొన్నాంబళంకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సారి ఆయనకు ఏమైంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితిపై సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 1980-90వ దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు పొన్నాంబళం. స్టంట్‌మ్యాన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత ప్రతినాయకుడిగా మారారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో బాగా సక్సెస్ అయిన పొన్నాంబళం పర్సనల్ లైఫ్ లో మాత్రం బాగా స్ట్రగుల్ అయ్యారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. అదే సమయంలో మానసిక, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులతో బాగా కుదులైపోయారు.

కొన్నేళ్ల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు పొన్నాంబళం. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటుడికి ఆపన్న హస్తం అందించారు. తనకు తెలిసిన వైద్యులతో మాట్లాడి పొన్నాంబళంకు సరైన చికిత్స అందేలా చూశారు. అలాగే వైద్య ఖర్చుల కోసం రూ. 50 లక్షలకు పైగా ఇచ్చారని పలు సందర్భాల్లో పొన్నాంబళమే చెప్పుకొచ్చారు. చికిత్స తర్వాత పొన్నాంబళం బాగానే కనిపించారు. ఆ మధ్యన కొన్ని సినిమా ఈవెంట్లలోనూ సందడి చేశారు. అయితే ఇప్పుడాయన మళ్లీ ఆస్పత్రిలో చేరడం సినీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పొన్నాంబళం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నా కోసం ప్రార్థించాలని సందేశం..

కాగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నాడు పొన్నాంబళం. ఆయన చివరిగా 2019లో ఓ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి