IND vs WI T20 WC Highlights: శాంసన్ కీలక ఇన్నింగ్స్.. ఘన విజయంతో సెమీస్ చేరిన భారత్
India vs West Indies, T20 world Cup 2026 Highlights: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. చివరి సూపర్ 8 మ్యాచ్‌లో, భారత్ వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు సామ్సన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

India vs West Indies, T20 world Cup 2026 Highlights: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. చివరి సూపర్ 8 మ్యాచ్‌లో, భారత్ వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు సామ్సన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.
LIVE Cricket Score & Updates
-
భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. చివరి సూపర్ 8 మ్యాచ్‌లో, భారత్ వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు సామ్సన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.
-
పాండ్యా క్యాచ్‌ను వదిలేసిన హోల్డర్
17వ ఓవర్లో రొమారియో షెపర్డ్ ఇన్నింగ్స్ తొలి బంతికే జాసన్ హోల్డర్ తన క్యాచ్‌ను వదిలేయడంతో భారత బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యాకు ఊరట లభించింది.
-
-
16 ఓవర్లకు
టీం ఇండియా 16 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. సంజు తన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది T20 ప్రపంచ కప్‌లో అతని మొదటి అర్ధ సెంచరీ.
-
తిలక్ వర్మ ఔట్..
టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ 27 పరుగులు సాధించిన తర్వాత ఓ భారీ షాక్ ఆడి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.
-
13 ఓవర్లకు
13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు సాధించింది. శాంసన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
-
-
సూర్య ఔట్..
195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 10.2 ఓవర్లలో 3 వికెట్లకు 99 పరుగులు చేసింది. సూర్యకుమార్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
-
9 ఓవర్లకు
9 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. శాంసన్ 48, సూర్య 17 పరుగులతో క్రీజులో నిలిచారు. ఈ ఇద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తయ్యింది.
-
ముగిసిన పవర్ ప్లే
పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్, సూర్యకుమార్ ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్..
ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 4.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది.
-
అభిషేక్ ఔట్..
అభిషేక్ శర్మ్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 29 పరుగులు సాధించింది.
-
2 ఓవర్లకు..
రెండు ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 12 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ క్రీజులో ఉన్నారు.
-
IND vs WI: ఓపెనర్లుగా అభిషేక్, శాంసన్
196 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది భారత్. ఈ క్రమంలో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వచ్చారు.
-
కోల్‌కతాలో అత్యధిక T20I టోటల్స్..
207/4 – స్కాట్లాండ్ vs ఇటలీ, 2026
202/7 – ఇంగ్లాండ్ vs ఇటలీ, 2026
201/5 – పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, 2016
195/4 – వెస్టిండీస్ vs ఇండియా, 2026, ఈరోజు
186/5 – ఇండియా vs వెస్టిండీస్, 2022
-
T20I లలో వెస్టిండీస్ vs ఇండియా తరపున అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు
245/6 – లాడర్‌హిల్, 2016
207/5 – హైదరాబాద్, 2019
196/3 – ముంబై (వాంఖడే), 2016
195/4 – కోల్‌కతా, 2026, ఈరోజు
194/1 – కింగ్‌స్టన్, 2017
-
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌పై అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు..
200/6 – ఇంగ్లాండ్, డర్బన్, 2007
196/3 – వెస్టిండీస్, వాంఖడే, 2016
195/4 – వెస్టిండీస్, కోల్‌కతా, 2026, ఈరోజు
190/10 – న్యూజిలాండ్, జోహన్నెస్‌బర్గ్, 2007
187/7 – దక్షిణాఫ్రికా, అహ్మదాబాద్, 2026
-
IND vs WI: టీమిండియా టార్గెట్ 196
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 196 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
200ల పరుగల దిశగా విండీస్..
17వ ఓవర్లో వెస్టిండీస్ స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. వరుణ్ చక్రవర్తి తొలి సింగిల్ తీసి 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆ ఓవర్లో మూడో బంతికి జాసన్ హోల్డర్ సిక్స్ కొట్టి 14 పరుగులు పిండుకున్నాడు.
-
IND vs WI: సిక్సర్ల వర్షం..
వెస్టిండీస్ 17 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్ 21, జాసన్ హోల్డర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
4వ వికెట్ కోల్పోయిన విండీస్..
వెస్టిండీస్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత వెంటనే మరో వికెట్ కోల్పోయింది. రూథర్ ఫోర్డ్ (14) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ జట్టు 14.1 ఓవర్ లో 119 పరుగులు చేసింది.
-
13 ఓవర్లకు..
వెస్టిండీస్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ , పావెల్ క్రీజులో ఉన్నారు.
-
హిట్ మేయర్ ఔట్..
డేంజరస్ బ్యాటర్ హిట్ మేయర్ (27) బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ జట్టు 11.3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.
-
10 ఓవర్లకు..
వెస్టిండీస్ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మైర్ క్రీజులో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన విండీస్..
9వ ఓవర్లో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. షాయ్ హోప్ 32 పరుగులకు అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 68 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.
-
వికెట్ల కోసం భారత బౌలర్ల ఎదురుచూపులు
వెస్టిండీస్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. షాయ్ హోప్, రోస్టన్ చేజ్ క్రీజులో ఉన్నారు. 5వ ఓవర్ 5వ బంతికి అభిషేక్ శర్మ రోస్టన్ చేజ్ క్యాచ్‌ను వదిలేశాడు.
-
ముగిసిన పవర్ ప్లే..
6 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. షాయ్ హోప్, రోస్టన్ చేజ్ క్రీజులో ఉన్నారు.
-
పుంజుకున్న వెస్టిండీస్
పవర్ ప్లేలో వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రదర్శన నెమ్మదిగా మొదలైంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చాలా కచ్చితత్వంతో బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం కష్టమైంది. అయితే రెండో ఓవర్‌లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్ ఒక భారీ సిక్సర్ బాదాడు. దీనితో వెస్టిండీస్ స్కోరు బోర్డు కదలడం ప్రారంభమైంది.
-
ఫస్ట్ ఓవర్
ఫస్ట్ ఓవర్ అర్షదీప్ వేశాడు. ఓవర్ కంప్లీట్ అయ్యే సరికి వెస్టిండీస్ 3 పరుగులు సాధించింది.
-
పిచ్ రిపోర్ట్
ప్రస్తుతం హోబర్ట్‌లో వాతావరణం చాలా బాగుంది. ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం వచ్చే సూచనలు ఏమాత్రం లేకపోవడంతో మ్యాచ్‌కు ఎటువంటి ఆటంకం కలగదు. ప్రేక్షకులు, ఆటగాళ్లు పూర్తి స్థాయి ఆటను ఆస్వాదించడానికి ఇది సరైన సమయం. ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉంది. ఇక్కడ పరుగుల పండగ జరగడం ఖాయం. మైదానం అవుట్‌ఫీల్డ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటిగా పేరుగాంచింది. దీనివల్ల బ్యాటర్లు కొట్టిన బంతి గ్యాప్‌లోకి వెళ్తే చాలు, రాకెట్‌లా బౌండరీ లైన్‌ను తాకుతుంది. చిన్న బౌండరీలు కూడా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.
బౌలింగ్ విషయానికి వస్తే, మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ విశ్లేషణ ప్రకారం ఇక్కడ స్పిన్నర్లకు పెద్దగా సహాయం అందదు. పిచ్ నుంచి వారికి ఎటువంటి టర్న్ దొరకడం కష్టమే. అయితే, ఫాస్ట్ బౌలర్లకు మాత్రం ఈ పిచ్ కొంత ఊరటనిస్తుంది. మైదానం కొలతలు చూస్తే, ఒక వైపు బౌండరీ 64 మీటర్లు, మరోవైపు 65 మీటర్లు ఉంది. ఇక స్ట్రెయిట్ బౌండరీ 73 మీటర్లుగా ఉంది. బౌండరీలు చిన్నవిగా ఉండటం, అవుట్‌ఫీల్డ్ వేగంగా ఉండటంతో బ్యాటర్లు ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది.
-
రింకూ సింగ్ ఔట్..
టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి రింకూ సింగ్ ను తప్పుకున్నాడు.
-
IND vs WI Milestones Alert: మైలురాళ్లు..
- సూర్యకుమార్ యాదవ్: కెప్టెన్‌గా తన 50వ T20I మ్యాచ్ ఆడుతున్నారు.
- శివం దూబే: తన 200వ T20 మ్యాచ్ ఆడుతున్నారు.
- షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్: తన 250వ T20 మ్యాచ్ ఆడుతున్నారు.
-
భారత్‌పై మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. (టీ20ఐ గత ఫలితాలు )
5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. (కోల్‌కతా, 2018)
6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. (చెన్నై, 2018)
6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. (హైదరాబాద్, 2019)
6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. (కోల్‌కతా, 2022)
-
ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.
-
IND vs WI Toss Update: టాస్ గెలిచిన భారత్..
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ చేయనుంది.
-
IND vs WI: స్వాగతం పలికిన స్డేడియం సిబ్బంది
ఇరుజట్ల ఆటగాళ్లకు ఈడెన్ గార్డెన్స్ సిబ్బంది స్వాగతం పలికారు.
#WATCH | Kolkata, West Bengal: Team India arrives at the Eden Gardens stadium for India vs West Indies match in the ICC Men’s T20 World Cup. pic.twitter.com/NHP4ZacC00
— ANI (@ANI) March 1, 2026
-
టాస్ గెలిస్తే..
కోల్‌కతా 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. తొమ్మిది మ్యాచ్‌లను బ్యాటింగ్ జట్టు గెలుచుకోగా, ఎనిమిది మ్యాచ్‌లను ఛేజింగ్ జట్టు గెలుచుకుంది. ఇక్కడ అత్యధిక జట్టు స్కోరు 207/4 గా నిలిచింది. స్కాట్లాండ్ ఇటలీపై చేసింది.
-
IND vs WI Weather Update: వాతావరణం
కోల్‌కతాలో వాతావరణం సాధారణంగా స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. కోల్‌కతాలో ఈ సాయంత్రం ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా.
-
స్కాట్లాండ్-ఇటలీ మ్యాచ్ పరిస్థితి?
స్కాట్లాండ్-ఇటలీ మ్యాచ్ జరిగిన ఈ పిచ్‌లోనే ఇండియా-వెస్టిండీస్ మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 207 పరుగులు చేయగా, ఇటలీ 134 పరుగులకే ఆలౌట్ అయింది.
-
పిచ్ నివేదిక, రికార్డులు
ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైనదిగా భావిస్తుంటారు. కాబట్టి భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. పిచ్ తయారీ పట్ల సౌరవ్ గంగూలీ సంతృప్తి చెందారని పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ అన్నారు. స్పిన్నర్లకు కొంత సహాయాన్ని అందిస్తుంది. సాయంత్రం మ్యాచ్‌లో మంచు కురిసే అవకాశం ఉంది.
-
IND vs WI: విండీస్ తరపున ఎవరంటే?
ఈ టోర్నమెంట్‌లో షిమ్రాన్ హెట్‌మైర్ ఆరు మ్యాచ్‌ల్లో 182.64 స్ట్రైక్ రేట్‌తో 221 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 85. వెస్టిండీస్ తరఫున గుడాకేష్ మోటీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లో 7.75 ఎకానమీ రేట్‌తో 10 వికెట్లు పడగొట్టాడు.
-
IND vs WI Live Updates: తోపు బ్యాటర్ ఎవరు?
ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు తరపున ఇషాన్ కిషన్ అత్యధిక పరుగులు చేశాడు. అతను 6 మ్యాచ్‌ల్లో 186.08 స్ట్రైక్ రేట్‌తో 214 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 77. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 6 మ్యాచ్‌ల్లో 7.2 ఎకానమీ రేట్‌తో 11 వికెట్లు పడగొట్టాడు.
-
IND vs WI Live Score: ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది?
ఇప్పటివరకు కోల్‌కతాలో భారత్ ఒకే ఒక్క ప్రపంచ కప్ మ్యాచ్ ఆడి గెలిచింది. మరోవైపు, వెస్టిండీస్ ఇక్కడ మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడి మూడింటినీ గెలుచుకుంది. ఈ ప్రపంచ కప్‌లో విండీస్ జట్టు ఇప్పటికే రెండుసార్లు కోల్‌కతాలో ఆడింది. అయితే ఈ టోర్నమెంట్‌లో టీమిండియా తొలిసారి ఈ గ్రౌండ్‌లో ఆడనుంది.
Published On - Mar 01,2026 5:04 PM
