AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పని చేశావన్నా..! సునీల్ నో చెప్పాడు.. ఆ యంగ్ హీరో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో అతను స్టార్‌గా మారిపోయాడు

ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్ సునీల్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సునీల్. దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సునీల్. సునీల్ మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్నాడు.

ఎంత పని చేశావన్నా..! సునీల్ నో చెప్పాడు.. ఆ యంగ్ హీరో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో అతను స్టార్‌గా మారిపోయాడు
Sunil
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2025 | 6:22 PM

Share

టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ అంటే ముందు వరసలో ఉండే పేర్లలో సునీల్ పేరు ఒకటి. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సునీల్.. ఆతర్వాత హీరోగా మారిపోయాడు. అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా మారాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాదరామన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అప్పటివరకు కమెడియన్ గా ఉన్న సునీల్.. ఆతర్వాత హీరోగా మారి వరుసగా సినిమాలు చేశాడు. పెళ్లి కొడుకు, పులా రంగడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. అయితే సునీల్ హీరోగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. సునీల్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

దాంతో సునీల్ ఇప్పుడు సహాయక పాత్రలు.. కామెడీ పాత్రలు చేస్తున్నాడు. అయితే ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు సునీల్ నో చెప్పాడట.. సునీల్ నో చెప్పడంతో ఆ సినిమా హీరో నాని దగ్గరకు వెళ్లిందట.. ఆ సినిమాతో నాని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో భలే భలే మగాడివోయ్ సినిమా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా ముందు సునీల్ కు వినిపించాడట మారుతి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే మారుతి ఈ సినిమా కథను ముందు సునీల్ కు చెప్పాడట.. హీరోకు మతిమరుపు అనే కాన్సెప్ట్ సునీల్ కు బాగా నచ్చిందట.. అయితే సినిమా పూర్తిగా కామెడీతో నిండిపోయింది.. కొన్ని యాక్షన్ సీన్స్, మాస్ సీన్స్ యాడ్ చేయమని చెప్పాడట.. అందుకు మారుతి ఒప్పుకోలేదట.. దాంతో ఆ కథను నానికి వినిపించి సినిమా చేశాడట మారుతి. ఈ విషయాన్నీ గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నాని కెరీర్ టర్న్ అయ్యింది.

ఇది కూడా చదవండి :ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి