Tollywood : అసలేం మారలేదు భయ్యా.. ఏళ్లైనా తరగని అందం.. అరుంధతి డ్యాన్స్ టీచర్ లుక్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో అరుంధతి ఒకటి. ఈ మూవీ హీరోయిన్ అనుష్క కెరీర్ ను మలుపు తిప్పింది. కథానాయికగా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.

సాధారణంగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులలో నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనే భావనను కలిగిస్తాయి. అలాంటి సినిమాలు తెలుగులో బోలెడన్నీ ఉన్నాయి. అందులో అరుంధతి సినిమా ఒకటి. టాలీవుడ్ స్టా్ర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2009లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఇందులో సోనూ సూధ్ భయంకరమైన విలన్ పాత్రలో నటించాడు. అప్పట్లో ఈ మూవీకి ప్రశంసలతోపాటు అవార్డులు సైతం వచ్చాయి. మొత్తం ఏడు విభాగాల్లో నంది పురస్కారాలను అందుకుంది. ఇక ఇందులో జేజమ్మ పాత్రలో అనుష్క యాక్టింగ్ వేరేలెవల్ అని చెప్పాలి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
అరుంధతి చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. చాలా కాలం తర్వాత ఈ సినిమా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఎందుకంటే.. ఈ చిత్రంలో అరుంధతి డ్యా్న్స్ టీచర్ గుర్తుందా.. ? కళ్లు కనిపించని డ్యాన్స్ టీచర్ పాత్ర.. సోనూసూద్ అరాచకానికి బలైపోతుంది. ఆ పాత్రలో నటించిన నటి పేరు లీనా సిద్ధు. ఇందులో ఆమె పాత్ర కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ అందం, అభియనంతో అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె పలు చిత్రాల్లో నటించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
లీనా సిద్ధు.. అరుంధతి తర్వాత ఛార్మీ నటించిన కావ్య’s డైరీ, లంక, హ్యాపీ హ్యాపీగా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన లీనా సిద్ధు.. ఆ తర్వాత సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ అందంలో ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తరగని అందం, ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
