Ram Charan: ఈ సినిమా చూస్తున్నంతా సేపు చాలా బాగా ఎంజాయ్ చేశా.. ఆ హీరో మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు
ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా ఈనెల 30న విడుదల కావాల్సి ఉండంతో ప్రస్తుతం తన సమయం మొత్తం ఈ మూవీకే కేటాయిస్తున్నాడు చరణ్. అయితే ఇంత బిజీలోనూ ఓ తెలుగు సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు మెగా పవర్ స్టార్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, సాయి కుమార్, దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు చరణ్. అయితే ఇంత బిజీ టైమ్ లోనూ అడివి శేష్ డెకాయిట్ సినిమాను చూశాడీ మెగా హీరో. అనంతరం నిమాపై తన అభిప్రాయలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
‘ఇప్పుడే డెకాయిట్ సినిమా చూశాను ఈ సినిమా చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో శేష్ తన నటనతో మరో లెవెల్ కి తీసుకెళ్లారు. శేష్ నటన చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. మృణాళ్ ఠాకూర్ తన పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమాకు ఆమె నటనే ఒక పెద్ద అసెట్. వీరే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఇతర నటీనటులు కూడా అద్భుతమైన నటనను కనబరిచారు. సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ కథను నమ్మి ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. హైటెక్నికల్ వాల్యూస్ తో సినిమాను ప్రజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. చిత్ర బృందం మొత్తానికి అభినందనలు’ అంటూ రాసుకొచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ ట్వీట్..
Watched #Dacoit and thoroughly enjoyed it.@AdiviSesh delivers a solid and memorable performance as Hari. @mrunal0801 is terrific and brings great depth to her role.@anuragkashyap72 Garu and the entire cast stand out with strong performances.#SupriyaYarlagadda Garu &…
— Ram Charan (@AlwaysRamCharan) April 14, 2026
షానియల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాళ్ జంటగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని, నాగ్ అశ్విన్, లేటెస్ట్ గా రామ్ చరణ్ తదితర సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




