AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

సౌత్ ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మలయాళం సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆమె ఒక కారణంతో దాదాపు 2 కోట్లు వదిలేసుకుందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే.

Tollywood: ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
Saipallavi
Rajitha Chanti
|

Updated on: Jul 31, 2026 | 5:05 PM

Share

తెలుగు సినీ ప్రయాణంలో చాలా మంది హీరోయిన్స్ తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. కొందరు తక్కువ సమయంలోనే సినిమాలకు దూరం కాగా.. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్న ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ఆ అమ్మడు.. ఒక చిన్న కారణంతో ఏకంగా రూ.2 కోట్లు వదిలేసుకుంది. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు కుర్రవాళ్ల హృదయాలు దొచుకున్న ఈ అమ్మడు.. తెలుగుతోపాటు తమిళం భాషలలో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో ఆమె రూపం ఆకర్షించింది. ఇక సీత పాత్రలో వెండితెరపై ఆమెను చూసేందుకు జనాలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయి పల్లవి గురించి తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

కెరీర్ తొలినాళ్లలో సాయి పల్లవికి ఓ కాస్మోటిక్ బ్రాండ్ నుంచి ప్రకటన ఆఫర్ వచ్చింది. అయితే తాను ఆ యాడ్ చేయనని సున్నితంగా రూ.2 కోట్ల ఆఫర్ తిరస్కరించింది. ప్రతి ఒక్కరూ తమ చర్మంపై, తమ రూపంపై నమ్మకం కలిగి ఉంటారు. అందంగా కనిపించాలంటే చర్మం తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు. నమ్మకం ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

సాయి పల్లవి పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

Follow Us