అందాల ముద్దుగుమ్మ, మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం
మెగా డాటర్ నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, ఒక మనసు సినిమాలో హీరోయిన్‌గా చేసి తన నటనతో అందిరినీ ఆకట్టుకుంది
సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక మనుసు, సూర్యకాంతం ఇలా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కానీ పలు కారణాల వలన విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ లీడ్ చేస్తుంది.
ఇక విడాకుల తర్వాత ఈ బ్యూటీ ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.
సొంతంగా పింక్ ఎలిఫెంటా అనే నిర్మాణ సంస్థ నిర్మించి, ఈమె ప్రొడక్షన్‌లో కమిటీ కుర్రవాళ్లు, అనే సినిమా నిర్మించి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ బ్యూటీ ఛాన్స్ దొరికినప్పుడళ్లా , తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తన క్యూట్ ఫొటోస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ,,చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది