మూడేళ్ళుగా నో సినిమాలు.. కానీ సొషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ 

31 July  2026

Pic credit - Instagram

Rajeev 

2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసింది కావ్య కళ్యాణ్ రామ్.  ఈ సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. 

బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఆమె.. తర్వాత చదువుపై దృష్టి సారించిన ఆమె అడపాదడపా కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది.

కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది.

అయితే 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం మసూదలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత హీరోయిన్ గా మూడు నాలుగు సినిమాలు చేసింది. 

వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఈ అమ్మడికి మంచి హిట్ అందించింది. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ అనే సినిమాలో నటించింది.

ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు మూడు ఏళ్లు అవుతున్నఇప్పటివరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు కావ్య.