తెలుగులోకి రీఎంట్రీకి రెడీ అయిన క్రేజీ హీరోయిన్.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

14 April 2026

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శోభన ఒకరు. ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది ఈ హీరోయిన్.

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో నటించి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణతో సినిమాలు చేసింది.

ఎనభై, తొంభైలలో అనేక చిత్రాలతో సూపర్ స్టార్ హోదాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ఒంటరిగా ఉంటుంది.

చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న శోభన.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. మలయాళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది.

నటనతో పాటు, నృత్యం పట్ల శోభనకు ఉన్న అభిరుచి ఆమెను ఇతర నటీమణుల నుండి వేరుగా నిలబెట్టే మరో అంశం అని చెప్పాలి. ఆమె క్లాసికల్ డ్యాన్సర్.

ప్రస్తుతం ఆమె జీవితాన్ని తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసింది. లాక్‌డౌన్ సమయంలో కూడా ఈ నటి నృత్య శిక్షణతో బిజీగా ఉంది ఈ హీరోయిన్. 

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన డ్యాన్స్ వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

శోభన రెండుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆమె 'మణిచిత్రతాళు' , 'మిత్రు మై ఫ్రెండ్' చిత్రాలలో తన నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్నారు.