AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటున్న నేను రెడీ టైటిల్ గ్లింప్స్.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రానున్న మూవీ

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “నేను రెడీ”..

ఆకట్టుకుంటున్న నేను రెడీ టైటిల్ గ్లింప్స్.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రానున్న మూవీ
Nenu Ready
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2025 | 5:55 PM

Share

“నేను లోకల్”, “ధమాకా”, “మజాకా” వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేను రెడీ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు త్రినాథరావు. ఇక ఈ సినిమాలో హవీష్ హీరోగా నటిస్తున్నాడు. హవీష్ గతంలో “నువ్విలా”, “జీనియస్”, “రామ్ లీలా” వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఒక వినోదాత్మక కుటుంబ కథగా రూపొందుతోంది. హవీష్ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

ఈ చిత్రం టైటిల్ మరియు గ్లింప్స్ 2025 జూన్ 26న (నేడు) హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. షూటింగ్‌లో కొంత భాగం పూర్తయింది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల కానుంది. గత సినిమాల మాదిరిగానే త్రినాథరావు ఈ సినిమాను కూడా కామెడీ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను నిఖిల కోనేరు, హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

త్రినాథరావు చివరిగా తెరకెక్కించిన మజాకా సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక హీరోయిన్ కావ్య థాపర్ చివరిగా డబుల్ ఇస్మార్ట్ సినిమాలో మెరిసింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నేను రెడీ సినిమాతో ఈ అమ్మడు హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నేను రెడీ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us