AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Diet: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే ఈ వెజ్ ఫుడ్స్ గురించి మీకు తెలుసా?

చాలామంది ప్రోటీన్ అనగానే కేవలం గుడ్లు లేదా మాంసాహారం గురించే ఆలోచిస్తారు. కానీ, మన వంటింట్లో ఉండే పప్పు ధాన్యాలు, పనీర్ వంటి పదార్థాల్లో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ దాగి ఉందన్న నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక సగటు వయోజనుడికి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల నుండి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. మీ ప్రోటీన్ లోటును భర్తీ చేసే ఆ అద్భుతమైన శాఖాహార అల్పాహారాల గురించి ఇప్పుడు చూద్దాం..

Protein Diet: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే ఈ వెజ్ ఫుడ్స్ గురించి మీకు తెలుసా?
High Protein Vegetarian Breakfast
Bhavani
|

Updated on: Mar 14, 2026 | 6:46 PM

Share

శాఖాహారులు ప్రోటీన్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తాజా పోషకాహార నివేదికలు చెబుతున్నాయి. పెసరపప్పు చిల్లా నుండి పనీర్ భుర్జీ వరకు, సత్తు పరాటా నుండి మొలకల సలాడ్ వరకు.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి. 60 నుండి 70 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు కనీసం 50 గ్రాముల ప్రోటీన్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ ప్రోటీన్ ఖజానాను ఎలా పొందాలో తెలుసుకుందాం..

1. పెసరపప్పు చిల్లా

పెసరపప్పును నానబెట్టి అల్లం, పచ్చిమిర్చితో రుబ్బి తయారు చేసే ఈ చిల్లాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో పాలకూర లేదా క్యారెట్ తురుము కలిపితే పోషక విలువలు రెట్టింపు అవుతాయి.

2. పనీర్ భుర్జీ – మల్టీగ్రెయిన్ రోటీ:

పనీర్ అనేది శాఖాహారులకు ఒక పవర్‌హౌస్. దీనిని మల్టీగ్రెయిన్ రొట్టెతో కలిపి తీసుకుంటే కండరాల బలానికి అవసరమైన పూర్తి ప్రోటీన్ అందుతుంది.

3. సత్తు పరాటా

కాల్చిన శనగ పిండితో (సత్తు) చేసే ఈ పరాటా బీహార్‌లో చాలా ఫేమస్. ఇది కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, రోజంతా ఆకలి వేయకుండా చూసే ఫైబర్‌ను కూడా అందిస్తుంది.

4. శనగపిండి చిల్లా

ఇది తక్కువ సమయంలో తయారయ్యే ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్. ఇందులో కొద్దిగా పెరుగు కలిపితే సాఫ్ట్‌గా ఉండటమే కాకుండా జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

5. మొలకెత్తిన గింజల సలాడ్

పెసలు, శనగలు వంటి మొలకలను ఆవిరిపై ఉడికించి నిమ్మరసం, చాట్ మసాలాతో తీసుకుంటే శరీరానికి నేరుగా లైవ్ ఎంజైమ్స్ ప్రోటీన్ అందుతాయి.

6. అడ్డై దోస

కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వివిధ రకాల పప్పులతో చేసే ఈ దోస ప్రోటీన్,  ఫైబర్‌కు పెట్టింది పేరు.

7. హంగ్ కర్డ్ పార్ఫైట్

పెరుగును వడకట్టి అందులో బాదం, వాల్‌నట్స్, పండ్లు కలిపి తీసుకుంటే ఇది బెస్ట్ కూలింగ్ ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది.

పప్పు దినుసులను 4-5 గంటలు నానబెట్టడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి.

ఉదయం పోహా వంటి అల్పాహారాల్లో వేయించిన వేరుశనగలు చేర్చుకోవడం వల్ల ప్రోటీన్ శాతం పెరుగుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ తీసుకోవడంపై తమ వైద్యుడిని సంప్రదించాలి.

Follow Us
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్