AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్..! ఈ ఫొటోలో సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న హీరోని గుర్తుపట్టారా.?

సినిమా తారాలకు సంబంధించిన ఫోటోలుఎం వీడియోలు సోషల్ మీడియాలో చాల వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబందించినవి. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ హడావిడి చేస్తుంటారు

చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్..! ఈ ఫొటోలో సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న హీరోని గుర్తుపట్టారా.?
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2025 | 6:07 PM

Share

సినీ సెలబ్రెటీల ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. సమాజంలో జరిగే వాటికంటే సీలబ్రెటీల గురించే ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా వాళ్ల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోలు వరకు సోషల్ మీడియాలో లేని ఫోటో ఉండదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది. యుగపురుషుడు నందమూరి తారకరామారావుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

ఇది కూడా చదవండి : కుబేర సినిమాలో అమ్మ పాట పాడింది ఈవిడే.. ఆమె గొంతులోనే ఎదో మాయ ఉంది..

పైన పేర్కొన్న ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఆ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.? సినిమాల కంటే మిగతా విషయాల్లో సోషల్ మీడియా వేదికగా తెగ ఫేమస్ అయ్యారు. అప్పుడెప్పుడూ 21 ఏళ్ల కిందట ఓ సినిమా చేయగా.. ఇటీవలే మళ్లీ  ఓ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా మినిమమ్ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈపాటికి అతడెవరో మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆ నందమూరి హీరో మరెవరో కాదు.. చైతన్య కృష్ణ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

నందమూరి చైతన్య కృష్ణ.. చాలా కాలం తర్వాత ఆమధ్య ‘బ్రీత్’ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. అయితే ఈ సినిమాకు మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. సినిమాలపై ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య కృష్ణ.. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత మళ్లీ నటనపై ఆసక్తితో బ్రీత్ అనే సినిమా చేశాడు. కాగా, చైతన్య కృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లో రాణించాలని.. తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చైతన్య కృష్ణ తాజాగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో తన తాత ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు సోషల్ మీడియా బ్యూటీ కదా మావ.! ఎవరో గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us