ఇప్పటికి దొరికింది మావ.! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిరపకాయ్ నటి.. ఇప్పుడు ఎలా ఉందంటే
మాస్ మహారాజా రవితేజ చేస్తున్న సినిమాలన్నీ ఈ మధ్య ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. రవితేజ నుంచి ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ చాలా రోజులకు ధమాకా అంటూ హిట్ కొట్టారు. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మాస్ మహారాజ హీరో రవితేజ సినిమాల్లో ‘మిరపకాయ్’.. ది బెస్ట్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. 2011లో విడుదలైన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ సినిమా అటు రవితేజ, ఇటు హరీష్ శంకర్‌లకు విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో తెల్సా..
ఇది కూడా చదవండి : కుబేర సినిమాలో అమ్మ పాట పాడింది ఈవిడే.. ఆమె గొంతులోనే ఎదో మాయ ఉంది..
అందంగా, డిఫరెంట్ వాయిస్‌తో సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు స్నిగ్థ. మిరపకాయ్ మూవీలో ఈమె కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ.. తన వాయిస్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా తప్ప.. మరే మూవీలోనూ కనిపించలేదు ఈమె. పైగా ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా లేదు.
ఇది కూడా చదవండి :హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్
మొన్నటికి మొన్న.. దర్శకుడు హరీష్ శంకర్ భార్య.. ఈ బ్యూటీ పేరు ఒకటే కావడంతో.. ఈమె ఫోటోలు మళ్లీ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ అంశంపైఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలకు పూర్తిగా దూరమైన స్నిగ్ధ.. పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉంటోందట. అక్కడే ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటోందట. కాగా, ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన పుట్టిన రోజుకు విషెస్ చెప్పిన అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. గుర్తు పట్టడం కష్టమే..
ఇది కూడా చదవండి :ఈ అమ్మడు సోషల్ మీడియా బ్యూటీ కదా మావ.! ఎవరో గుర్తుపట్టారా..?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి =








