Manchu Manoj: కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ రివ్యూ.. ఏమన్నాడంటే
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జిన్నా సినిమా తర్వాత విష్ణు హిస్టారికల్ కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా నేడు (శుక్రవారం) విడుదలైంది. కన్నప్ప సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్, మధుబాల ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సినిమా విడుదల తర్వాత మంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది. సినిమా పై ప్రేక్షకులు మంచి రివ్యూస్ ఇస్తున్నారు. అలాగే సినీ సెలబ్రెటీలు కూడా కన్నప్ప సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి : కుబేర సినిమాలో అమ్మ పాట పాడింది ఈవిడే.. ఆమె గొంతులోనే ఎదో మాయ ఉంది..
అలాగే కన్నప్ప సినిమా పై మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా మంచు మనోజ్ కన్నప్ప సినిమా చూశారు. సినిమా చూసి బయటకు వచ్చిన ఆయన సినిమా పై రివ్యూ ఇచ్చాడు. సినిమా చాలా బాగుంది.. చివరి 20 నిముషాలు అస్సలు ఊహించలేదు. సినిమా చివరి 20 నిముషాలు అదిరిపోయింది.. ప్రభాస్ గారిది. అలాగే అన్న( మంచు విష్ణు) కూడా బాగా చేశాడు. మోహన్ బాబు గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అదరగొట్టేశారు. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆ శివుడిని కోరుకుంటున్నా అని అన్నారు మనోజ్.
ఇది కూడా చదవండి :హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్
ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం. వహించారు ‘మహాభారతం’ కు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖేష్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నప్ప పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) విడుదలైంది. ఇక ఈ సినిమాలో అతిథి పాత్రలలో ప్రభాస్ (రుద్ర), అక్షయ్ కుమార్ (శివుడు), కాజల్ అగర్వాల్ (పార్వతి), మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ (కథానాయిక), మధుబాల, బ్రహ్మానందం, రఘు బాబు తదితరులు నటించారు.
ఇది కూడా చదవండి :ఈ అమ్మడు సోషల్ మీడియా బ్యూటీ కదా మావ.! ఎవరో గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








