అలాంటి వారిని వదిలిపెట్టను.. హెచ్చరించిన మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన హిస్టారికల్ మూవీ ‘కన్నప్ప’. ప్రభాస్‌తో పాటు ఎందరో స్టారాది స్టార్స్ నటించిన ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 300కోట్లతో ఈ సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది. ఇక టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ తో ఈ మూవీపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు టీమ్ ఓ సీరియస్ వార్నింగ్ నోట్ రిలీజ్ చేసింది. ఇక ఆ నోట్‌లో ఏముంది అంటే..! కన్నప్ప సినిమా విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు తాము పొందామని.. ఇక సినిమా విమర్శకులు ముందుగా తమ సినిమా చూడాలన్నారు. సినిమాలోని కంటెంట్‌ను గౌరవించాలి. తమ సినిమా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని.. అలాగే తమ సినిమా గురించి అభిప్రాయాలను పంచుకోవచ్చనిచెప్పారు. అలాగని ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్‌గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆ నోట్‌లో హెచ్చరించారు మంచు విష్ణు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని.. అలాగని ద్వేషపూరిత భాషను సహించలేమన్నారు. కేరళ హైకోర్టు ఇటీవల ఉత్తర్వుల ప్రకారం, ఏదైనా సృజనాత్మక కళను ఉద్దేశపూర్వకంగా విమర్శించడం లేదా కించపరచడం నేరం అని తీర్పు చెప్పిందన్నారు. అలాగే సోషల్ మీడియాలో లేదా ఏదైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో తమ సినిమాకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించడం కూడా నిషేధమన్నారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. అలా చేసేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే సింపుల్‌గా చెప్పుకొంటే కన్నప్ప సినిమాకు సంబంధించిన ఎవరైనా క్రిటిక్స్, యూట్యూబర్స్ నెగిటివ్‌గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు
రన్నింగ్ ట్రైన్‌లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు
నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
