నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో ఛైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి.. స్టార్‌లుగా ఎదిగిన వారు చాలామందే ఉన్నారు. అందులో ముద్దుగుమ్మ శృతి హాసన్ కూడా ఒకరు. తండ్రి దిగ్గజ నటుడు. తల్లి కూడా ప్రముఖ నటినే. దీంతో చిన్నవయసులోనే శ్రుతి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగలిగింది. తొలి రోజులలో తండ్రితో కలిసి ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ క్యూటీ, ఆ తర్వాత హీరోయిన్ గానూ సత్తా చాటింది.
హీరోయిన్ గా నటిస్తూనే సింగర్‌గానూ రాణించింది ఈ అందాల భామ.హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో అంతగా కలిసి రాకపోయినా.. తర్వాత మంచి విజయాలు అందుకుని తానేంటో నిరూపించుకుంది శృతి. ఇటీవలే పాన్ ఇండియా హిట్ కూడా అందుకున్న ఈ చిన్నది.. తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేసిందో ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మధ్యలో లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నా.. రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా శ్రుతిహాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శ్రుతిహాసన్ తాను చేయించుకున్న సర్జరీ గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను టీనేజ్‌లో ఉండగా, నా ముక్కు నచ్చకపోవటంతో సర్జరీ చేయించుకున్నా.. అలాగే ముఖం మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా చేయించా. ఇందులో దాపరికం ఏమీ లేదు. చాలా ఇంటర్వ్యూల్లో నేను చెప్పా కూడా.. చాలామంది ఇలాంటి వాటి గురించి బయటికి చెప్పరు. అది వాళ్ల ఇష్టం. నేను వారి అభిప్రాయాన్ని గౌరవిస్తా.. అలాగే నాలాగే దైర్యంగా బయటకు చెప్పేవారిని తప్పుబట్టాల్సిన పనీ లేదు. రేపటి రోజు నా వయసు మరింత పెరిగాక.. నేను ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటానేమో. అయినా .. నా ఒళ్లు.. నా ఇష్టం. నా నిర్ణయం వల్ల మరొకరికి నష్టం లేనప్పుడు ఎవరైనా దాన్ని ఎందుకు ప్రశ్నించాలి? అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో రెచ్చిపోయి రచ్చ చేసిన మహిళ.. ఏంటి మావా ఇలా ఉన్నారు
లక్ అంటే ఆ జాలరిదే.. ఒక్క దెబ్బకు లక్షాధికారిని చేసిందిగా
అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
