విమానంలో రెచ్చిపోయి రచ్చ చేసిన మహిళ.. ఏంటి మావా ఇలా ఉన్నారు
సాధారణంగా బస్సులు, రైళ్లలో సీట్లకోసం కొట్టుకోవడం చూశాం. ఇప్పుడు ఈ సీట్ల కొట్లాట విమానాలకు కూడా పాకింది. అవును, గాల్లో ఎగురుతున్న విమానంలో ఓ మహిళ చేసిన గొడవ మామూలుగా లేదు. రన్నింగ్ విమానంలో వెనుక కూర్చున్న ప్రయాణికులతో ఆమె చేసిన వాగ్వాదం కాస్త కొట్టుకోవడం వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
సాధారణంగా విమాన ప్రయాణం అంటే చాలా వరకు ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్లు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాగే, విమాన ప్రయాణాల్లో చాలా వరకు గొడవలు, కొట్లాటాలు వంటివి జరగవు. ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్లు మాత్రమే కూర్చుని వెళ్తుంటారు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళ ప్రయాణికురాలు విమానంలో తన వెనుక సీటులో ఉన్న ప్రయాణికులతో వాగ్వాదం పెట్టుకుంది. వారిపై గట్టిగా అరుస్తూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. దాంతో వెంటనే విమాన సిబ్బంది అక్కడకు వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీసి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం 11A సీటు విషయంలో వివాదంగా తెలుస్తోంది.. కానీ, వీడియోలో మాత్రం ఆమె గట్టిగా అరుస్తూ.. .చేతులు చూపిస్తూ ఎదుటివారికి వార్నింగ్ ఇస్తోంది. ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిని కూడా ఆమె వాయించేసింది. ఎయిర్ హోస్టెస్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ అంటే ఆ జాలరిదే.. ఒక్క దెబ్బకు లక్షాధికారిని చేసిందిగా
అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా
హ్యాకర్ల చేతుల్లోకి ఏకంగా 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
