లక్ అంటే ఆ జాలరిదే.. ఒక్క దెబ్బకు లక్షాధికారిని చేసిందిగా
ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నానీ గోపాల్ అనే మత్స్యకారుడి సుడి తిరిగిపోయింది. ఓ రేంజ్‌లో లక్ కలిసొచ్చింది. దిఘా నదీ ముఖద్వారంలో అతను విసిరిన వలలో అరుదైన తెలియా భోలా చేపలు చిక్కాయి. అవి కూడా రెండు, మూడు కాదండోయ్.. ఏకంగా 29 చేపలు ఒకేసారి పడ్డాయి. ఒక్కో చేప 20 కిలోలకు పైగా బరువు ఉంది.
దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. నదీముఖద్వారంలోని చేపల వేలం కేంద్రంలో ఈ చేపలు రూ.33 లక్షల ధరకు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిలోని ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల తీవ్రమైన వ్యాధుల మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా సౌందర్య సాధనాల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సంఘటన ఆ జాలరి జీవితానికి కీలక మలుపు తీసుకొచ్చింది. నానీ గోపాల్ ఇక తన కుటుంబానికి ఎటువంటి ఢోకా లేదని చెబుతున్నాడు. ఈ ఘటన స్థానిక మత్స్యకారులలో ఆశలు రగిలించింది. ఆ గంగమ్మ ఆశీస్సులు తమకు కూడా దక్కాలని వారు కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా
హ్యాకర్ల చేతుల్లోకి ఏకంగా 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

