అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా
గుజరాత్ వలసాడ్ జిల్లా వాపీలో ఐదడుగుల పొడవనున్న భారీ కోబ్రా కలకలం సృష్టించింది. స్థానిక ముక్తానంద్ రోడ్డుకు సమీపంలోని శ్రీరంగ్ సొసైటీలోని ఓ ఇంటి బాత్ రూంలో కనిపించిన ఈ పామును చూసి.. ఇంట్లోని వాళ్లకు చెమటలు పట్టించింది. తొలుత ఈ ఇంటిలోని మహిళ దానిని గమనించి, స్థానిక లైఫ్ రెస్క్యూ ఫౌండేషన్‌కు సమాచారం అందించింది.
దీంతో సదరు సంస్థ వాలంటీర్లు వచ్చి ఆ పామును పట్టుకోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ పామును అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టకిల్ కోబ్రాగా గుర్తించారు. పామును పట్టుకోవటానికి వచ్చిన వాలంటీర్లకు బాత్‌రూం కమోడ్‌లో కనిపించిన పాము..ఒక పట్టాన చేతికి చిక్కలేదు. అటూ ఇటూ మెసులుతూ బుసలు కొట్టి, తప్పించుకునే యత్నం చేసింది. అయితే, ఎట్టకేలకు లైఫ్ రెస్క్యూ టీమ్ ఒడుపుగా దానిని పట్టుకుంది. ముందుగా గుర్తించటం వల్ల తాము ఈ గండం నుంచి తప్పించుకున్నామని, సమయానికి వచ్చి పామును పట్టుకున్నందుకు గానూ వారు లైఫ్ రెస్క్యూ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ వాలంటీర్లు అటవీ అధికారులకు సమాచారమిచ్చి, సదరు భారీ నాగుపామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హ్యాకర్ల చేతుల్లోకి ఏకంగా 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

