రన్నింగ్ ట్రైన్‌లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు
ముంబై లోకల్ ట్రైన్‌లలో ఉండే రద్దీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం వేల సంఖ్యలో జనాలు ముంబైలోని లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఇలా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సీటు కోసం గొడవలు జరిగిన ఘటనలు మన ఇప్పటికే ఎన్నో చూశాం. తాజాగా మరోసారి అలాంటి ఘటను సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.
ముంబై నగరంలోని లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, పరస్పరం రక్తం వచ్చేలా దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. అసలేం జరిగిందంటే. చర్చ్‌గేట్ నుంచి విరార్‌కు వెళ్తున్న ఓ లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ మహిళా ప్రయాణికులతో నిండిపోయింది. ఈ క్రమంలో రైల్వే డోర్ వద్ద నిలబడిన ఇద్దరు మహిళల మధ్య చిన్నగా వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వివాదం కాస్తా పెద్దగా మారి జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లింది. అంతటితో ఆడకుండా ఇద్దరు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ఇద్దరిలో ఒక మహిళకు తల పగిలి రక్తం ధారగా కారింది. పక్కనే ఉన్న ఇతర ప్రయాణికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు ఆగలేదు. దీంతో వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తర్వాతి స్టేషన్‌లో వారిని దించేశారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి భయాందర్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్
విమానంలో రెచ్చిపోయి రచ్చ చేసిన మహిళ.. ఏంటి మావా ఇలా ఉన్నారు
లక్ అంటే ఆ జాలరిదే.. ఒక్క దెబ్బకు లక్షాధికారిని చేసిందిగా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

