AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran-Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. పడిపోనున్న వీటి ధరలు.. భారతీయులకు పండుగే

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంతో భారత్‌లో బాస్మతి బియ్యం ధరలు తగ్గే అవకాశముంది. ఇటీవల ఇరాన్‌కు పెరిగిన ఎగుమతుల కారణంగా వీటి ధరలు పెరిగాయి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరాన్‌కు ఎగుమతులు తగ్గనున్నాయి. దీని కారణంతో భారత్‌లో బాస్మతి బియ్యం ధరలు తగ్గనున్నాయని తెలుస్తోంది.

Iran-Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. పడిపోనున్న వీటి ధరలు.. భారతీయులకు పండుగే
Basmati Rice Prices
Venkatrao Lella
|

Updated on: Mar 01, 2026 | 1:39 PM

Share

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో యుద్దం జరుగుతోంది. రెండు దేశాలు శనివారం మధ్యాహ్నం నుంచి క్షిపణులతో దాడి చేసుకుంటున్నాయి. అమెరికా కూడా తమ క్షిపణులతో ఇరాన్‌పై యుద్దానికి దిగింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చగా.. ఆయన కుటుంసభ్యులు కూడా ఈ దాడిలో మృతి చెందారు. దీంతో ఆయన కుమారుడిని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఖమేనీ భద్రతా దశంలోని పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ దాడుల్లో మరణించారు. ఈ యుద్ద ప్రభావం పశ్చిమాసియాపై కూడా పడటంతో రానున్న కొద్ది నెలల పాటు ప్రపంచస్థాయిలో ఆర్ధికంగా దీని ప్రభావం చూపనుంది. ఇక భారత్‌పై కూడా ఈ యుద్దం ప్రభావం చూపుతోంది. పసిడి, ముడి చమురు ధరలతో పాటు బాస్మతి ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.

పెరిగిన బాస్మతి బియ్యం ధరలు

ఇరాన్‌కు భారత్ పెద్ద సంఖ్యలో బాస్మతి బియ్యాన్ని సరఫరా చేస్తోంది. యుద్దం వల్ల ఇరాన్‌తో వాణిజ్యం నిలిచిపోనుంది. ఇరాన్‌కు భారత్ ఎగుమతి చేసే బాస్మతి బియ్యం సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారత్ నుంచి ఇరాన్ బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు యుద్దం వల్ల వాణిజ్యం నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల ముందు భారత్ నుంచి బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునేందుకు ఇరాన్ భారీగా ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఆర్డర్ల కారణంగా భారత మార్కెట్లలో బాస్మతి బియ్యం ధరలు కేజీకు రూ.10 మేర పెరిగాయి. యుద్దం ప్రారంభం కావడంతో ఇరాన్‌కు ఎగుమతి కావాల్సిన బాస్మతి బియ్యం రావాణ మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో రవాణా కొన్ని నెలల పాటు నిలిచిపోయే ప్రమాదముంది. భారీగా ఎగుమతుల కారణంగా బాస్మతి బియ్యం ధరలు పెరగ్గా.. ఇప్పుడు ఎగుమతులు తగ్గడం వల్ల త్వరలోనే ధరలు తగ్గే అవకాశముందని తెలుస్తోంది.

నిలిచిపోనున్న టీ ఎగుమతులు

ఇక భారత్ నుంచి ఇరాన్‌కు టీ ఎగుమతులు కూడా నిలిచిపోతున్నాయి. 2024-25లో భారత్ నుంచి దాదాపు రూ.7 బిలియన్ల టీని ఇరాన్ ఎగుమతి చేసుకుంది. ఇక భారత్ మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతుల్లో 25 శాతం ఇరాన్‌కు సరఫరా అవుతుంది. ఇక ఇరాక్‌కు 20 శాతం వెళ్తుంది. 2 మిలియన్ టన్నులకుపైగా బిస్మతి బియ్యం ఎగుమతి అవుతుండగా.. దీని విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇరాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల విలువై బాస్మతి బియ్యాన్ని ఇరాన్‌కు భారత్ ఎగుమతి చేసింది. కాగా ఇరాన్ ఎక్కువగా ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు యుద్దం వల్ల వాటి సరఫరాకు అంతరాయం కలగనుంది. దీని వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అంటున్నారు.

Follow Us