AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Split AC: ఒక్కసారి ఆన్ చేస్తే 15 సెకన్లలో ఇల్లంతా కూలింగ్.. బాబోయ్.! బాహుబలి ఏసీ భయ్యా..

ప్రముఖ టెక్ దిగ్గజం షియోమీ అత్యంత వేగంగా గదిని చల్లబరిచే 'మిజియా స్ట్రాంగ్ ఎయిర్ 1.5 హెచ్‌పి' ఏసీని విడుదల చేసింది. ఇది కేవలం నిమిషాల్లోనే ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా, స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ చేసే.. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

Split AC: ఒక్కసారి ఆన్ చేస్తే 15 సెకన్లలో ఇల్లంతా కూలింగ్.. బాబోయ్.! బాహుబలి ఏసీ భయ్యా..
Ac
Ravi Kiran
|

Updated on: Apr 15, 2026 | 9:26 AM

Share

స్మార్ట్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న షియోమీ, గృహోపకరణాల విభాగంలో మరో సంచలనాన్ని సృష్టించింది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేలా అత్యాధునిక సాంకేతికతతో ‘మిజియా స్ట్రాంగ్ ఎయిర్ 1.5 హెచ్‌పి’ స్ప్లిట్ ఏసీని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. సూపర్ ఫాస్ట్ కూలింగ్‌తో పాటు తక్కువ విద్యుత్ వినియోగమే లక్ష్యంగా ఈ కొత్త ఏసీని రూపొందించారు. షియోమీ కొత్త మిజియా ఏసీలో ప్రధాన ఆకర్షణ దీని ‘ఫాస్ట్ కూలింగ్’ సామర్థ్యం. ఈ 1.5 హెచ్‌పి సామర్థ్యం గల ఏసీ, గదిని కేవలం కొన్ని నిమిషాల్లోనే చల్లబరిచేలా శక్తివంతమైన కంప్రెసర్‌ను కలిగి ఉంది. ఇందులో అమర్చిన భారీ గాలి గొట్టం, అధునాతన ఫ్యాన్ డిజైన్ కారణంగా, గాలి చాలా వేగంగా, సమానంగా గది అంతా వ్యాపిస్తుంది. తీవ్రమైన ఎండల్లో కూడా గది ఉష్ణోగ్రతను తక్షణమే తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుంది.

మిజియా స్ట్రాంగ్ ఎయిర్ ఏసీ కేవలం కూలింగ్‌తో మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫీచర్లతో వస్తోంది. షియోమీకి చెందిన ‘మిజియా యాప్’ ద్వారా ఈ ఏసీని స్మార్ట్‌ఫోన్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. రిమోట్ అందుబాటులో లేకపోయినా, ఎక్కడి నుంచైనా ఏసీని ఆన్ లేదా ఆఫ్ చేయడం, ఉష్ణోగ్రతను మార్చడం వంటివి సులభంగా చేయవచ్చు. దీనితో పాటు, వాయిస్ కమాండ్ ద్వారా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయం కూడా ఇందులో ఉంది. అత్యుత్తమ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉండటం వల్ల, కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుందని సంస్థ పేర్కొంది. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ఏసీలో స్వయం శుభ్రత సాంకేతికతను చేర్చారు. ఇది ఏసీ లోపల పేరుకుపోయే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాను తొలగించి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

అధిక ఉష్ణోగ్రతల వద్ద లోపల ఉన్న తేమను ఆరబెట్టడం ద్వారా దుర్వాసన రాకుండా నిరోధిస్తుంది. నిశ్శబ్దంగా పనిచేయడం దీని మరో ప్రత్యేకత, దీనివల్ల నిద్రకు ఎటువంటి భంగం కలగదు. ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదలైన ఈ ఏసీ, త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక ఫీచర్లు ఉండి కూడా సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలోనే దీనిని ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ ధరలో ప్రీమియం ఏసీని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఆప్షన్.

ఇది చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..

Follow Us