AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..! ముహూర్తం ఫిక్స్

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. పీఎఫ్ వడ్డీని జమ చేసేందుకు రెడీ అవుతుంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు మధ్యలో రావడంతో కాస్త జాప్యం జరిగింది. మార్చి 31 తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఆలస్యమైంది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..! ముహూర్తం ఫిక్స్
Epfo 4
Venkatrao Lella
|

Updated on: Apr 15, 2026 | 11:59 AM

Share

ఈపీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల, వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో.. ఈ సారి వడ్డీ జమ ఆలస్యం అవుతోంది. ప్రతీసారి మార్చి 31 తర్వాత వడ్డీని విడుదల చేసే ప్రాసెస్ మొదలవుతుంది. కానీ ఈ సారి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో విడుదలలో జాప్యం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం వడ్డీని జమ చేయనుందని తెలుస్తోంది.మేలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కేంద్రం పీఎఫ్ వడ్డీ జమ చేయడంపై నోటిఫికేషన్ జారీ చేయనుంది.

జూన్ తర్వాత ఎప్పుడైనా

జూన్‌కు ముందే పీఎఫ్ వడ్డీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. అనంతరం చందాదారులకు డబ్బులు విడుదల చేయనుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ నిధులు పడతాయని తెలుస్తోంది. మీ అకౌంట్లో జమ అయ్యే నెలవారీ నిధుల ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. అయితే మీకు ఆర్ధిక సంవత్సరంలో చివరిలో మాత్రమే నిధులను జమ చేస్తారు. పీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన మొత్తం ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. పీఎఫ్ సొమ్ము ఆలస్యంగా జమ చేసినా పూర్తి వడ్డీ జమ చేస్తారు. ప్రస్తుతం 2025-26 ఆర్ధిక సంత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీని రేటును ఈపీఎఫ్‌వో ఇటీవల ఫిక్స్ చేసింది. వడ్డీ రేటును 8.25 శాతంగా కన్ఫార్మ్ చేసింది. వరుసగా మూడో ఏడాది వడ్డీ రేట్లను స్ధిరంగా ఉంచింది. మూడేళ్లుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

త్వరలో కొత్త మార్పులు

ఇక ఈపీఎఫ్‌వోలో త్వరలో కొత్త మార్పులు రానున్నాయి. పీఎఫ్‌ నగదును సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు యూపీఐ, ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే యూపీఐ ఆప్షన్ రావాల్సి ఉన్నప్పటికీ.. పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ప్రారంభం కాలేదు. అయితే త్వరలో దీనిని ప్రారంభించే అవకాశముంది. తొలుత బీమ్ యాప్ ద్వారా ఉససంహరించుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్‌లలో కూడా ఆప్షన్ తీసుకురానున్నారు. ఇక ఏటీఎం సేవలను కూడా త్వరలో ప్రవేశపెట్టే అవకాశముంద. మీ దగ్గర ఉండే డెబిట్ కార్డు ద్వారా ఏటీఎంలకు వెళ్లి క్షణాల్లో పీఎఫ్ నగదు తీసుకోవచ్చు. ప్రస్తుతం యూఏఎన్ పోర్టల్‌లోకి వెళ్లి పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టాల్సి వస్తుంది. దీని వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. క్లెయిమ్ ఆమోదం పొందితే మూడు, నాలుగు రోజుల్లో డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి.

Follow Us