AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోల కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్లకు డబుల్ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు..

హీరోల కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్లకు డబుల్ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 6:48 PM

Share

టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సైతం భారీ బడ్జెట్లు కేటాయించడం కొత్త ట్రెండ్‌గా మారింది. నాని ‘ప్యారడైజ్’ కోసం రూ.150 కోట్లకు పైగా, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. హీరోల మార్కెట్ కంటే కంటెంట్, విజువల్ గ్రాండియర్‌పైనే నమ్మకం ఉంచి భారీ రిస్క్ తీసుకుంటున్న ఈ ప్రాజెక్టులు ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

టాలీవుడ్‌లో ఖతర్నాక్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు.. హీరోల మార్కెట్‌తో పని లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్మి నిర్మాతలు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సైతం ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతూ విజువల్ వండర్స్‌గా మలుస్తున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ చూస్తుంటే.. ఆడియన్స్‌కే కంగారు పుడుతుంది. మరి నిర్మాతల పరిస్థితేంటో..? నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ దసరా సినిమాకు 65 కోట్ల షేర్ వచ్చింది.. కానీ ఆయన మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్యారడైజ్ కోసం 150 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు తగ్గట్లేదు. శ్రీకాంత్ ఓదెలకు కథపై ఎంత నమ్మకం ఉన్నా.. ఇది ఓ రకంగా నాని కెరీర్‌పై చేస్తున్న అతిపెద్ద రిస్క్. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా.. మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రణబాలి కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతుంది. సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లోనూ అద్భుతమైన విజువల్స్ కనిపిస్తూ.. వాళ్ళు ఖర్చు స్క్రీన్ మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా కేర్ తీసుకుంటున్నారు. ఇది హిట్టైతే రౌడీ బాయ్ మేనియా మళ్లీ మొదలైపోయినట్లే. సెప్టెంబర్ 11న రానుంది రణబాలి. నిర్మాతలు గుడ్డిగా కాకుండా కంటెంట్‌ను బలంగా నమ్మి చేస్తున్న ఈ ప్రయోగాలు రేపు థియేటర్లలో వర్కవుట్ అయితే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ సినిమాలు గానీ హిట్ కొడితే.. టాలీవుడ్‌లో మన మీడియం రేంజ్ హీరోలంతా పక్కాగా మరో మెట్టెక్కుతారు. మొత్తానికి కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే బడ్జెట్ మ్యాటరే కాదంటున్నారు నిర్మాతలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఈ రూల్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే!

నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు

నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ

ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?

మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”

Follow Us