AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు

నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు

Phani CH
|

Updated on: Jun 19, 2026 | 6:04 PM

Share

నెల్లూరు జిల్లా దువ్వూరులో జరిగిన కుటుంబ ఆత్మహత్యల ఘటనలో హృదయ విదారక నిజాలు వెలుగులోకి వచ్చాయి. విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, భార్య రత్నమాల, కుమారుడు సాయిసుకృత్‌ల చివరి క్షణాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఆరోగ్య సమస్యలు, కుమారుడి మానసిక ఇబ్బందులు కారణంగా కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో జరిగిన విశ్రాంత ఉపాధ్యాయుడు చీరాల మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నమాల, కుమారుడు సాయిసుకృత్‌ల కుటుంబం సామూహిక ఆత్మహత్యల ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన, గుండెలను పిండేసే నిజాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలను చూసిన పోలీసులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ఆస్తులన్నీ బంధువులకు రాసిచ్చి.. చివరికి తాము చనిపోయాక అంత్యక్రియలకు అయ్యే ఖర్చుల డబ్బును కూడా ముందే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి.. పక్కా ప్లానింగ్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డారు రిటైర్డ్‌ టీచర్‌ మధుసూధనరావు కటుంబం. తాము పెద్దవారమైపోతున్నామని, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం సహకరించడంలేదని, తమ కుమారుడు కూడా మానసిక ఇబ్బందులతో బాధపడటంతో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మరణవాంగ్మూలంలో తెలిపారు. వీరి ఆత్మహత్య దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిన్నప్పుడు వేలు పట్టి నడక నేర్పిన తండ్రే.. తన చేతులతో కొడుకును మృత్యువు వైపు నడిపించిన దారుణ దృశ్యాలు అందులో ఉన్నాయి. కొడుకు సాయిసుకృత్ నోటికి వస్త్రం కట్టి, గట్టిగా అరవమని తండ్రి చెప్పడం, ఆ కేక బయటకు రాకపోవడంతో అంతా సవ్యంగానే ఉందని నిర్ధారించుకోవడం భయాందోళన కలిగిస్తుంది. ఆ తర్వాత ఎత్తయిన బల్లపై కుమారుడిని నిలబెట్టి, కాళ్లు చేతులు కట్టేసి.. ‘నాన్నా.. ఒక్కో అడుగు పక్కకు వెయ్‌.. ఆ తర్వాత దూకెయ్‌.. అని తండ్రి నిర్దయగా సూచించాడు, ఆ బిడ్డ తండ్రి మాట జవదాటకుండా చేశాడు. ప్రాణాలు వదిలేశాడు. అనంతరం భార్య రత్నమాల ముత్తయిదువుగా నిండైన బొట్టు పెట్టుకుని ఉరేసుకోగా, చివరగా మధుసూదన్‌రావు ప్రాణాలు తీసుకున్నారు. ఒక తండ్రే కాలయముడిగా మారి భార్యాబిడ్డలను చావు వైపు నెట్టిన ఈ ఘటన నుంచి దువ్వూరు గ్రామం ఇంకా కోలుకోలేకపోతోంది. పోలీసులు ఈ సీసీటీవీ ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ

ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?

మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యాలు.. ఇది ఎయిర్‌పోర్టా.. రైల్వేస్టేషనా!

130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న నర్స్ మాటలు !

Follow Us