AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?

ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?

Phani CH
|

Updated on: Jun 19, 2026 | 5:30 PM

Share

మెట్రో నగరాల్లో పిల్లలను పెంచడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో ఒక కంటెంట్ క్రియేటర్ వెల్లడించిన లెక్కలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గర్భధారణ పరీక్షల నుంచి డెలివరీ వరకు, బిడ్డకు అవసరమైన వస్తువుల కొనుగోలు వరకు మొత్తం ఆరు నెలల్లోనే దాదాపు రూ.4 లక్షలు ఖర్చయినట్లు ఆయన వివరించారు. ఈ లెక్కలు యువ దంపతులను ఆలోచింపజేస్తున్నాయి.

మెట్రో నగరాల్లో నివసించే దంపతులకు పిల్లలను కనడం, వారిని పెంచడం ఆర్థికంగా ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి బిడ్డకు ఆరు నెలలు వచ్చేసరికి అక్షరాలా రూ. 4 లక్షలు ఖర్చయిందంటూ ‘అయాన్ చక్రవర్తి’ అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘డాడ్ డైరీస్’ పేరుతో ఆయన పంచుకున్న ఈ లెక్కలు పిల్లల్ని పెంచే క్రమంలో అయ్యే ఖర్చులను కళ్లకు కట్టాయి. భార్య గర్భం దాల్చిన మొదటి రోజు నుంచే ఖర్చుల పర్వం మొదలైందనీ అయాన్ చక్రవర్తి రాసుకొచ్చారు. డాక్టర్ విజిట్స్, స్కాన్‌లు, రక్త పరీక్షలు, మందుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందనీ కేవలం మందులు, సప్లిమెంట్ల కోసమే నెలకు రూ. 1,500 నుండి ₹2,000 వరకు ఖర్చయినట్లు చెప్పారు. ఇక ఆసుపత్రిలో డెలివరీ బిల్లు రూ.1.2 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు చేరిందని తెలిపారు. పాప పుట్టిన ప్రారంభ నెలల్లో కొన్ని వస్తువుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. బిడ్డ పడుకునే ఉయ్యాల కోసం రూ. 15,000 వరకు, బట్టల కోసం రూ.8,000 వరకు ఖర్చయిందనీ వీటితో పాటు ఫీడింగ్ బాటిళ్లు, స్టెరిలైజర్లు, ఇతర అత్యవసర వస్తువుల కోసం దాదాపు రూ. 10,000 ఖర్చు చేసినట్లు అయాన్ తన వీడియోలో లెక్కలు వేసి చూపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యాలు.. ఇది ఎయిర్‌పోర్టా.. రైల్వేస్టేషనా!

130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న నర్స్ మాటలు !

భారీ ట్రాక్టర్‌ను తన రెక్కలతో ఆపేసిన పక్షి..! గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ

ఒక సాధారణ వెల్డర్‌.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!

Follow Us