ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
స్పేస్‌ఎక్స్‌లో వెల్డర్‌గా చేరిన జువాన్ హెర్నాండెజ్‌కు కంపెనీ ఇచ్చిన షేర్లు అతని జీవితాన్నే మార్చేశాయి. 2015లో దాదాపు రూ.9.5 లక్షల విలువైన షేర్లు పొందిన అతను, వాటిని అమ్మకుండా పదేళ్లు ఉంచుకున్నాడు. స్పేస్‌ఎక్స్ భారీ లిస్టింగ్ తర్వాత ఆ షేర్ల విలువ దాదాపు రూ.10 కోట్లకు చేరింది. ఉద్యోగి షేర్ ఓనర్‌షిప్, దీర్ఘకాలిక పెట్టుబడుల శక్తిని ఈ కథ నిరూపించింది.
స్పేస్‌ఎక్స్ మాజీ వెల్డర్ టు మల్టీ మిలియనీర్: రూ. 9.5 లక్షల షేర్లు రూ. 10 కోట్లు ఎలా అయ్యాయి? ఈ సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? సాధారణంగా ఒక వెల్డర్‌ని … ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇనుప ఊచలను, యంత్రాలను వెల్డింగ్ చేస్తూ..రోజువారీ కూలీనో లేదా నెలజీతాన్నో సంపాదించుకునే వ్యక్తి గానో చూస్తాం. కానీ, అదే వెల్డర్ ఒక చారిత్రాత్మక స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కారణంగా ఏకంగా కోట్ల రూపాయల సంపదకు అధిపతి అయ్యాడంటే నమ్ముతారా? నమ్మకపోయినా ఇది నిజం. ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ లో పనిచేసిన ఒక మాజీ వెల్డర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చే ‘స్టాక్ ఓనర్‌షిప్’ ఒక సాదాసీదా కార్మికుడిని ఎలా కోటీశ్వరుడిని చేసిందో తెలిపే అద్భుతమైన సక్సెస్ స్టోరీ మీకోసం.. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జువాన్ హెర్నాండెజ్ అనే వ్యక్తి 2015లో ఒక స్నేహితుడి ద్వారా సమాచారం తెలుసుకుని స్పేస్‌ఎక్స్‌లో వెల్డర్‌గా చేరాడు. ఆ సమయంలో అతనికి స్పేస్‌ఎక్స్ కంపెనీ గురించి గానీ, దాని అధినేత ఎలాన్ మస్క్ ఆశయాల గురించి గానీ పెద్దగా అవగాహన లేదు. అది కూడా తనకు దొరికిన మిగతా సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగాల లాంటిదేనని అనుకున్నాడు. అయితే, ఉద్యోగంలో చేరిన కొత్తలో కంపెనీ అతనికి జీతంతో పాటు సుమారు 10,000 డాలర్ల అంటే దాదాపు 9.5 లక్షలు విలువైన కంపెనీషేర్లను బోనస్‌గా ఇచ్చింది. అంతకుముందు తను చేసిన ఏ ఉద్యోగంలోనూ ఇలా షేర్లు ఇచ్చే సంప్రదాయం లేకపోవడంతో, హెర్నాండెజ్ మొదట్లో ఆ ఆఫర్‌ను పెద్దగా పట్టించుకోలేదు. కాగితాల మీద ఉన్న ఆ షేర్లు భవిష్యత్తులో తన జీవితాన్ని మార్చేస్తాయని అతను ఊహించలేకపోయాడు. స్పేస్‌ఎక్స్‌లో దాదాపు పదేళ్లపాటు పనిచేసిన హెర్నాండెజ్, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. తన ప్రతిభతో వెల్డర్ స్థాయి నుంచి సూపర్‌వైజర్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత అతను మరో అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ లోకి మారినప్పటికీ, స్పేస్‌ఎక్స్ ఇచ్చిన షేర్లను మాత్రం అలాగే ఉంచుకున్నాడు. అతని వద్ద మొత్తం 6,500 స్పేస్‌ఎక్స్ షేర్లు ఉన్నాయి. ఇటీవల స్పేస్‌ఎక్స్ సంస్థ రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 7.13 లక్షల కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నాస్‌డాక్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ప్రారంభమైన మొదటి రోజే స్పేస్‌ఎక్స్ షేరు ధర 160.95 డాలర్లు అంటే సుమారు రూ. 15,308 వద్ద ముగిసింది. దీనితో హెర్నాండెజ్ వద్ద ఉన్న 6,500 షేర్ల విలువ ఒక్కసారిగా 1 మిలియన్ డాలర్లకు పైగా, అంటే దాదాపు రూ. 9.95 కోట్లకు చేరింది! తొమ్మిదిన్నర లక్షల రూపాయల విలువైన ఆఫర్ కాస్తా, ఇప్పుడు పది కోట్ల రూపాయల భారీ సామ్రాజ్యంగా మారింది. ఈ అసాధారణ విజయంపై హెర్నాండెజ్ స్పందిస్తూ.. కంపెనీలో ఉద్యోగులకు వాటాలు ఇవ్వడం అనేది వారిలో ఒక బలమైన బాధ్యతా భావాన్ని కలిగిస్తుందని చెప్పాడు. “మనం కేవలం జీతం కోసం పనిచేసే జీతగాళ్లం కాదు, కంపెనీ లాభనష్టాలతో మన భవిష్యత్తు కూడా ముడిపడి ఉందనే భావన కార్మికుల్లో వస్తే, వారు ప్రాణం పెట్టి పనిచేస్తారు. స్పేస్‌ఎక్స్ విజయంలో మా శ్రమ కూడా ఉంది, అందుకే ఈరోజు ఆ విజయం మా కుటుంబాల జీవితాలను మార్చేసింది” అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంత పెద్ద మొత్తంలో సంపద చేకూరినప్పటికీ, హెర్నాండెజ్ తన పనిని ఆపే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. తాను ఎప్పటిలాగే కష్టపడుతూనే ఉంటానని, అయితే ఈ సంపదను తన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడిగా మారుస్తానని చెప్పాడు. ముఖ్యంగా తన టీనేజ్ కుమార్తెకు స్టాక్ మార్కెట్, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు, ఇన్వెస్ట్‌మెంట్ల గురించి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నట్లు తెలిపాడు. చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఐపీఓగా నిలిచిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ ఎంట్రీ.. కేవలం ఎలాన్ మస్క్ సంపదను పెంచడమే కాదు, సంస్థను నమ్ముకున్న వేలాది మంది సాధారణ ఉద్యోగులను, ఇంజనీర్లను, టెక్నీషియన్లను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. ఒక కంపెనీ సాధించే విజయం కేవలం బోర్డ్ రూమ్‌లకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసే కార్మికుడి వరకు చేరినప్పుడే అది నిజమైన ప్రగతి అని ఈ ఘటన నిరూపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్ బీస్ట్ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి.. అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి.. కుటుంబం ఆత్మహత్య
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్ ఫాస్ట్ స్కీం నేటి నుంచే!
కార్పొరేట్ లుక్‌లో సర్కారు బడులు.. విద్యార్థులకు సరికొత్త యూనిఫాంలు..
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..

