హైదరాబాద్లోని చార్మినార్ పరిధిలో అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు చేశారు. FSSAI లైసెన్సు లేకుండా అత్యంత అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న ఈ గోదాములో నిషేధిత రంగులు, పదే పదే ఉపయోగించిన వంట నూనెను గుర్తించారు. భారీగా చికెన్, నూనె, రసాయనాలను సీజ్ చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. కల్తీపై రాజీలేని పోరాటం చేస్తామని అధికారులు హెచ్చరించారు.